ఏపీలో ప్రజా సమస్యల విషయంలో ఇప్పుడు విపక్షాలు కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. కొన్ని కొన్ని సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తూ సిఎం జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. రాజకీయంగా బలహీనంగా ఉన్న విపక్షాలు అన్నీ కూడా సిఎం జగన్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నాయి అనే చెప్పాలి. ఇక తాజాగా  కాంగ్రెస్ పార్టీ నిరసన బాట పట్టింది. ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి తో మాట్లాడాలని  లెటర్ రాస్తే ముఖ్యమంత్రి నుండి స్పందన లేదు అని ఆయన మండిపడ్డారు.

ఆంద్రప్రదేశ్ రాజధాని విషయం పై కలవాలని సీఎం కి లేఖ రాశాను అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ లు చేశారు అని ఆయన విమర్శించారు. రైతుల పోరాటం కి మద్దతు ఇవ్వాలని అడగాలని అనుకున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ కి మంగళం పాడొద్దు అని అడగాలని భావించాం అని ఆయన తెలిపారు. ఏపీలో కీలకంగా మారిన పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆయన వ్యాఖ్యలు చేసారు. పోలవరం ప్రాజెక్ట్ పై సవాల్ ప్రతి సవాల్ చూసాం అని, పోలవరం విషయం లో మొదటి ముద్దాయి చంద్రబాబు.. అయితే..  అసలు ముద్దాయి జగన్ అని ఆయన విమర్శలు చేసారు.

పోలవరం నిర్మాణం కేంద్రం చేయాల్సి వస్తే మీరెందుకు కడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. నియంతృత్వానికి ప్రజా స్వామ్యం లో స్థానం లేదు అని అన్నారు. అసెంబ్లీ జరిగే విధానం చూస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అరవటం కరవటం ఒకటే తెలుసు అన్నారు. మరో సారి మాతో మాట్లాడాలని సీఎం కి లేఖ రాస్తాం అని, అప్పుడు కూడా స్పందన లేకుంటే ఏమి చేయాలో అది చేస్తాం అని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: