టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ ప్రభుత్వాలున్నా అధికారయంత్రాంగానికి కొన్ని పరిమితులు, పరిధులుంటాయని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్నకేసులను, గత చరిత్రను అధికారులు ఒక్కసారి పరిశీలిస్తే మంచిది అని ఆయన సూచించారు. అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటు జగన్ కు ఉంది అన్నారు. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపినందుకు కావొచ్చు, ఆయన సంతోషపెట్టడానికి కావొచ్చు గానీ పరిధులు దాటి వ్యవహరించిన అధికారులంతా జైలుకు వెళ్లారు అన్నారు.

ఇప్పటికీ కొందరు ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అని ఆయన తెలిపారు. బ్యాచ్ లో టాపర్ గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీమతి శ్రీలక్షి చావు అంచులవరకు వెళ్లొచ్చారు అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంతులేని అవినీతి ఆశ, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిత్వమే అందుకు కారణం అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకూడదు కానీ, రాజశేఖర్ రెడ్డి చనిపోయారు కానీలేకుంటే, జగన్ పై మోపబడిన అన్నికేసుల్లో ఆయన కూడా ముద్దాయిగా ఉండేవాడని సీబీఐ గతంలో అభిప్రాయ పడింది అని ఆయన అన్నారు.

మంత్రి పేర్ని నానీపై తాపీతో దాడి చేసిన వ్యక్తి, దాడిచేసిన రోజున సదరు మంత్రి వెంటే ఉన్నాడు అని, అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపితే మంచిది అని ఆయన సూచించారు. దాడిచేసిన వ్యక్తి టీడీపీ వాడని, కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని పోలీసుల దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? అని నిలదీశారు. నంద్యాల ఘటనలో చట్టం ఇచ్చిన పరిమితులు దాటి వ్యవహరించినందుకే, సీఐ, హెడ్ కానిస్టేబుళ్లు ఇప్పుడు జైలు కూడు తింటున్నారు అన్నారు. ఎక్కడ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ, అధికారులు పరిధులు దాటి వ్యవహరిస్తూ, ఓవరాక్షన్ చేస్తున్నారో,  అటువంటి వారిని గుర్తించడంకోసం టీడీపీ ఒక కమిటీని నియమించింది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: