వెరైటీ రోల్స్ చేయడం లో బాలకృష్ణ కి సాటి ఎవరు రారు.. అంతేకాదు వేరే హీరోల సినిమాల్లో చిన్న పాత్ర అయినా నటించి అందరివాడు అనిపించుకున్నాడు బాలకృష్ణ.. అలాంటి బాలకృష్ణ ప్రస్తుతం ఫ్లాప్ లలో సతమతమవుతున్నారు.. నందమూరి బాలకృష్ణ కూడా గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..  

చిత్రం నుంచి టీజర్ రాగ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సింహ, లెజెండ్ లాంటి సినిమా ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మరో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని చెప్తున్నారు. కందిరీగ‌, హైపర్ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న సంతోష్ శ్రీ‌నివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందట. బాల‌య్య కోసం సంతోష్ శ్రీ‌నివాస్ ఓ క‌థ రెడీ చేసుకున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ లో ఈ క‌థ వినిపించాడు కూడా. ఆ క‌థ వాళ్లకు బాగా న‌చ్చింది. దాంతో బాల‌య్య‌ని లాక్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈ సినిమా కోసం `బ‌ల‌రామ‌య్య బ‌రిలోకి దిగితే..` అనే టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: