దుబ్బాక లో గెలిచిన ఉత్సాహం ఇప్పుడు బీజేపీ లో స్పష్టంగా కనిపిస్తుంది. టీ ఆర్ ఎస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకత ను పూర్తి గా వినియోగించుకుని దుబ్బాక లో స్వల్ప తేడాతో విజయ భేరి మోగించింది. అయితే అదే ఉత్సాహాన్ని గ్రేటర్ లోనూ కనపరుస్తూ ఇక్కడ కూడా గెలు గుర్రం ఎక్కే ప్రయత్నం చేసి తృటిలో చేజారిపోయింది... హైదరాబాద్ లో పలు పరిస్థితుల వల్ల టీ ఆర్ ఎస్ పై వ్యతిరేకత ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది..ఆ ప్లాన్ ని అమలు చేసి దాదాపు సక్సెస్ అయ్యింది..

నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ కి బలం కాదు కదా అండగా నిలిచే వారు కూడా ఎవరు లేరు.. అలాంటిది సడ్డెన్ గా పార్టీ బలపడడం దగ్గరినుంచి గెలిచేవరకు పుంజుకుంది అంటే ఖచ్చితంగా  అది బీజేపీ నేతల కష్టం అని చెప్పాలి..ఎంతలేదన్నా గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల పరంగా టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్‌ఎస్‌ 55 డివిజన్లలో విజయం సాధిస్తే.. బీజేపీ 48 స్థానాల్లో కాషాయ జెండా ఎగరేసింది. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. కానీ, అభ్యర్థి మెజారిటీ కంటే స్టాంపు ఓట్లు ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఫలితాన్ని నిలిపి వేశారు. గెలుపొందిన సీట్ల లెక్కన టీఆర్‌ఎస్సే ముందంజలో ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కలో మాత్రం కమలం విజయం సాధించింది. బీజేపీకి అత్యధికంగా 12,13,900 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇది మొత్తం 31.43 శాతం.

టీఆర్‌ఎస్‌కు 11,89,250 ఓట్లు పోల్ అయ్యాయి. ఇది 30.79 శాతం. 2016లో బీజేపీకి వచ్చిన ఓట్లు 3,46,253 మాత్రేమ. ఈ సారి ఎనిమిదిన్నర లక్షల ఓట్లు అధికంగా పొందింది. గత ఎన్నికలతో పోలిస్తే 2.79 లక్షల ఓట్లను టీఆర్‌ఎస్‌ కోల్పోయింది. భారత ప్రజాస్వామ్యం మెజార్టీ మీద ఆధారపడి ఉంది.సీట్ల మెజార్టీలో అసెంబ్లీలలో లెక్కలు తేలుస్తాయి కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ లెక్కల ఓట్ల మెజార్టీలో బీజేపీ అనూహ్యమైన ఎదుగుదల నమోదు చేసింది. అధికార పార్టీ కన్నా అత్యధికంగా ఓట్లు సాధించడం అంటే.. మామూలు విషయం కాదు. ఈ విషయంలో భారతీయజనతా పార్టీ విజయం సాధించించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: