గ్రేటర్ ఎన్నికల్లో బి‌జే‌పి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయినతమ పార్టీ నేతల్లో ఆనందం నింపింది.గతం తో పోలిస్తే ఈ సారి 4 స్థానాల నుండి ఏకంగా 48 స్థానాలు కైవసం చేసుకుని ఇతర పార్టీలకు సవాల్ విసిరింది.దీంతో బి‌జే‌పి పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.తాజాగా బి‌జే‌పి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని బి‌జే‌పి కి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్. ఎన్నికల్లో బీజీపీ కార్యకర్తలు కలిసి కట్టుగా శ్రమించారని ఆయన తెలిపారు.అధికార పార్టీ,ఎలక్షన్ కమిషన్ కుమ్మకై  గ్రేటర్ ఎన్నికలను పథకం ప్రకారమే హడావిడిగా నిర్వహించారని ఆయన ఆరోపించారు.

ఎన్నికల కమీషన్ పూర్తిగా విఫలమైందని, టీఆర్ఎస్ చెప్పుచేతల్లోనే నడిచిందని బండి సంజయ్ అన్నారు.గెలుపు కోసం టీఆర్ఎస్ నాయకులు అడ్డదారులు తొక్కారని, టీఆర్ఎస్ అక్రమాలను అడుగడుగునా అడ్డుకున్నామని బండి సంజయ్ తెలిపారు. అదేవిధంగా 2023లో బీజేపీని తెలంగాణ లో అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని బండి సంజయ్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: