గ్రేటర్ సమరం ముగిసింది..  నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో బిజెపి పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చింది.. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బీజేపీ ప్రభుత్వం  టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిందనే చెప్పుకోవాలి ..  అయితే కొన్ని డివిజన్లలో బిజెపి పార్టీ  గెలవక మేయర్ పీఠాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది.. అయితే బిజెపి గెలుపుపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ఒక సమావేశం ఏర్పాటు చేసారు .. ఈ సమావేశం లో అయన మాట్లాడుతూ ,

గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ప్రజలు అండగా నిలిచారని బండి సంజయ్ అన్నారు.. అయితే ఎన్నికల సమయం చాలా తక్కువగా ఉండటం చేత  ఈసారి చాలా హడావిడిగా నిర్వహించామని,  కనీసం ఎన్నికల కమిషన్ అభ్యర్థులను ఖరారు చేసే సమయం కూడా  ఇవ్వలేదు అని ఆయన అన్నారు..  ఈ సందర్భం బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై కొన్ని విమర్శలు చేశారు..  టిఆర్ఎస్ నాయకులు  గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం కోసం చాలా అడ్డదారులు తొక్కారని  అడుగుఅడుగున  మాపై ఘర్షణలకు దిగారని మా ప్రచారాన్ని అడ్డుకున్నారని అయన తెలిపారు..

కచ్చితంగా 2023 వ సంవత్సరానికి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ దిశగా మేము ఇప్పటి నుంచే ప్రణాళిక వేస్తున్నామని  బండి సంజయ్ తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో  మా  పార్టీ గెలిచే అంచుల వరకు వెళ్లిందని అన్నారు.. ఈ ఎన్నికల్లో ఎవరికి అత్యధిక స్థానాలు రాలేదని మా పార్టీ టిఆర్ఎస్ టీం గట్టిపోటీ   ఇచ్చిందని అన్నారు..  అయితే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూస్తే 55 స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించగా ,48 స్థానాల్లో బిజెపి గెలుపొందింది..  గత గ్రేటర్ ఎన్నికల్లో  చూసుకుంటే ఈసారి బీజేపీ  పార్టీ ఎక్కువ స్థానాలు  గెలిచిందని చెప్పుకోవాలి .. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే మేయర్ పీఠం మా తప్పించుకుకోలేదని ధీమా వ్యక్తం చేసారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: