అల్ ఇండియా సూపర్ స్టార్ రజినికాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నెలాఖరులో పార్టీ ని అధికారికంగా ప్రకటించనున్నారు.పార్టీకి సంబందించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు రజినికాంత్ సలహాదారు తమిలరువి మణీయన్.ఆయన మాట్లాడుతూ పార్టీ ఏర్పాటుకు సంబందించి అన్నీ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

రజిని పార్టీ అన్నీ రాజకీయ పార్టీల లాగా విద్వేష రాజకీయాలు చేయకుండా ఆధ్మాత్మిక రాజకీయాలు చేస్తుందంటున్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 234 స్థానాలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెలాఖరున కొత్త పార్టీకి సంబందించిన అన్నీ వివరాలను రజనీకాంత్‌ ప్రకటిస్తారని, పార్టీ విధివిధానాలపై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తమిళరువి మణియన్‌ అన్నారు. 

రజనీకాంత్‌ ఆధ్యాత్మిక రాజకీయానికి ఏ మతంతోనూ సంబంధం లేదన్నారు. మహాత్మాగాంధీ ఇలాంటి రాజకీయాలనే కోరుకున్నారని వ్యాఖ్యానించారు.తాము ప్రత్యర్థి పార్టీలకు కూడా విలువ ఇస్తామని అనవసరంగా విమర్శలు చేయమని, అన్నారు. ప్రజలకు ఏం చేస్తామో, రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలను చేపడతామో వివరించి ప్రజల మనస్సులను గెల్చుకుంటామని తమిళరువి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: