కాంగ్రెస్ నేత విజయశాంతి పార్టీ మార్చడంపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది.. అయితే గత కొన్ని రోజులుగా విజయశాంతి బిజెపి పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన అందులో నిజం లేదు.. మొన్నటికి మొన్న పార్టీ ప్రచారం కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కి వచ్చిన నేపథ్యంలో విజయశాంతి అతని సమక్షంలో బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి..  అయితే అది కూడా నిజం కాదని  తేలిపోయింది.. విజయశాంతి బిజెపి పార్టీలో లో చేరడం పై చాలామందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ..

అయితే విజయశాంతి ఇప్పటికే పాలు బిజెపి నాయకులతో సమావేశాలు జరుపగా
కాంగ్రెస్ నాయకులూ మాత్రం   విజయశాంతి ఇప్పట్లో బీజేపీలో చేరడం లేదని  కొట్టి పారేస్తూ వస్తున్నారు ..కాంగ్రెస్ నాయకులూ   విజయ శాంతి మాత్రం అధికారిక బీజేపీలో చేరుతున్నానని  ఇంకా ప్రకటించలేదు.. విజయశాంతి ఏ వార్తా చెప్పకుండా బీజేపీలో చేరడం ఖాయమే అని పలు వర్గాల నుండి మాటలు అనిపిస్తుంది.. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయశాంతి కాషాయ మాస్క్ ధరించి రావడంపై  ఆమె బీజేపీ చేరుతున్నట్లు దాదాపుగా ఖాయం అయిందని తెలుస్తుంది ..

అయితే విజయశాంతి  బీజేపీలోకి ఎప్పుడు చేరుతారు అనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో మరోసారి దీనిపై బండి సంజయ్ ఒక  క్లారిటీ ఇచ్చారు.. మరో రెండు రోజుల్లో విజయశాంతి బిజెపిలో చేరుతారని అయన  స్పష్టం చేశారు..  గ్రేటర్ ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ సందర్భంగా విజయశాంతి బీజేపీలో చేరడం పై స్పందించడం విశేషం .. ఈ మేరకు బండి సంజయ్ క్లారిటీ ఇవ్వడంతో రెండు రోజుల్లో విజయశాంతి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు .. అయితే మరో రెండు రోజుల్లో విజయశాంతి బీజేపీ పార్టీ చేరడంపై ఒక సమాధానం వచ్చే అవకాశం ఉంది .. ఎన్నో రోజుల నిరీక్షణకు ఆ రెండు రోజుల్లో తెర పడనుంది ..


  

మరింత సమాచారం తెలుసుకోండి: