హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఏ పార్టీకీ రాలేదు. దీంతో మేయర్ పీఠం ఎవరిదనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు గెలుపొంది అతి పెద్ద పార్టీగా అవతరించింది. రెండో స్థానంలో 48 స్థానాలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దుమ్ము లేపింది. మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం పార్టీకి 44 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచి అవమానం మూట కట్టుకుంది. టీడీపీ అయితే కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు.

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారుతున్నారని, కాషాయ కండువా కప్పుకోబోతున్నారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తనకు బీజేపీలో చేరు ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ గనుక టీఆర్‌ఎస్‌తో కలిస్తే మాత్రం కచ్చితంగా బీజేపీలో చేరతానని కుండబద్ధలు కొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల భాష మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మాటకు మాట అనేట్లు ఉండాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం క్రమశిక్షణ లేని సైనికుల్లా ఉన్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతల ప్రవర్తన వల్ల కాంగ్రెస్‌ నేతలు.. కేసీఆర్‌ జేబులో మనుషులు అన్న అపవాదు వచ్చిందని, ఇలాంటి అపవాదులు మూటగట్టు కోవడం ఘోరమని అభిప్రాయ పడ్డారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో తమ పార్టీ వెనుకపడిన విషయాన్ని ఒప్పుకున్నారు. ఎవరికి పీసీసీ చీఫ్ పదవి వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలనిక సీనియర్ నేతలందరం ఒక మాట మీదకు వచ్చామని తెలియజేశారు. కేసీఆర్‌కు పదునైన భాషతో బదులు చెప్పే నేతలే కావాలన్నారు. కేసీఆర్‌ దగ్గర చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉందన్న ఆలోచనల్లో జనం ఉన్నారని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: