భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో బలపడే క్రమంలో కొన్ని కొన్ని కీలక అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ సహా తెరాస  నేతల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై చాలానే చర్చలు ఉన్నాయి. రాజకీయంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడంతో చాలా మంది నేతలు బయటకు రావడానికే ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది యువ నేతలు పార్టీ మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మాజీ హోం మంత్రి జానా రెడ్డి పార్టీ మారే  అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది.

దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో చేరే అంశంపై తనకు జానారెడ్డి నుంచి ఫోన్ కాల్ రాలేదన్న బండి సంజయ్... జానారెడ్డి, ఆయన తనయుడు వేర్వేరు కాదు అని స్పష్టం చేసారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో సోమవారం విజయశాంతి బీజేపీలో చేరుతున్నారు అని వెల్లడించారు. హైద్రాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారు అన్నారు. రెండు మూడు రోజుల్లో బీజేపీ కార్పోరేటర్లతో కలసి భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్తాం అని ఆయన పేర్కొన్నారు.

2023లో అధికారంలోకి రావటమే మా లక్ష్యం అన్న ఆయన...  ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే..  బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచేది అని స్పష్టం చేసారు. బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అన్నారు. ముఖ్యమంత్రి తీరును మార్చుకోకుంటే ప్రజా  ఉద్యమాలు చేస్తాం అని ఆయన హెచ్చరించారు. కేంద్రం నిధుల విషయంలో హైద్రాబాద్ అభివృద్ధికి సహకరిస్తాం అని ఆయన తెలిపారు. భూపేందర్ యాదవ్ ను ఇంఛార్జ్ నియమించినప్పుడే మాకు గెలుస్తామన్న నమ్మకం కలిగింది అని, డీజీపీ, ఎన్నికల సంఘం, ఎంఐఎం టీఆర్ఎస్ ... అందరూ ఒక్కటే అని, రెండు డివిజన్లకే పరిమితమైన కాంగ్రెస్ నేతలకు బీజేపీని విమర్శించే అర్హత లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: