ఏపీలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలు అధికార పార్టీని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి అనే చెప్పాలి. రాజకీయంగా ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఆయన కులాల అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి రాష్ట్ర సర్కార్ ని టార్గెట్ చేసారు. దుష్ప్రచారంతో నన్ను.. బీసీలకు దూరం చేయలేరు అని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చూపుతూ మోసం చేస్తున్నారని విమర్శలు చేసారు. తప్పుడు ప్రచారంతో బీసీలను టీడీపీకి దూరం చేసేందుకు కుటిలయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. యూనివర్శిటీ నియామకాల్లో, టీటీడీ బోర్డులో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. వైసీపీ చేస్తున్న మోసాలను బహిర్గతం చేయడంతో అక్కసుతో దుష్ప్రచారం జరుగుతుంది అని ఆయన విమర్శించారు. అనుక్షణం బీసీల పురోభివృద్ధికి తాపత్రయపడ్డా అని ఆయన చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీ వచ్చాకే బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్ధిక భరోసా కలిగిందని, బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీయే అని ఆయన స్పష్టం చేసారు. మొట్టమొదట సారిగా భట్రాజ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం అని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించాం అన్నారు. జగన్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా రద్దు చేయడంతో 16,800 మందికి నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. సలహాదారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సులర్ల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, తెలుగు భాష వాడుకలో భట్రాజ వంటి కొన్ని సామాజిక వర్గాలకు ఇబ్బందికరం అన్నారు. వినియోగంలో భవిష్యత్తులో అత్యంత శ్రద్ధ చాటుకుంటాం అని ఆయన చెప్పుకొచ్చారు. పద ప్రయోగాలతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా టీడీపీ నడచుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని సామాజికవర్గాలను కించపరుస్తున్నారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: