ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఆంధ్ర  ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పడం జరిగింది. ఈరోజు అనగా  శనివారం రాష్ట్రంలో చాలా తక్కువ  స్థాయిలో కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో  కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగినా కూడా , మరణాలు భారీగా పడిపోతున్నాయి. డిశ్చార్జిల పెరగడంతో యాక్టివ్ కేసుల మొత్తం 6 వేలకు పడిపోయాయి. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 57,132 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 630 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్  సోకిన వారి సంఖ్య 8,71,305కి చేరింది.

శనివారం 882 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,58,115 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,166కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,50,283 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.నిజంగా జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ రకంగా తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యి మరణాల సంఖ్య తగ్గడం చాలా చెప్పుకోదగిన విషయం. ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ కి సంబంధించిన వార్తల  కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: