భారత్ అంటే నిలువునా విషం నింపుకున్న చైనా ఎపుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. దక్షిణాసియాలో తానే నంబర్ వన్ గా ఉండాలన్నది చైనా కుటిల ఆలోచన. అదే సమయంలో అన్ని దేశాలతో సయోధ్యను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న భారత్ అంటే చైనాకు ఒక విధమైన అక్కసు అని కూడా చెప్పాలి.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారత్ లాంటి పెద్ద దేశాన్ని అతలాకుతలం చేస్తుందని ప్రపంచం అంచనా వేసింది. చైనా అయితే భారత్ ఈ దెబ్బకు తట్టుకోలేదు అని కూడా భావించింది. కానీ జరిగింది వేరు. అతి తక్కువ నష్టంతో భారత్ ఈ గండం నుంచి నెమ్మదిగా బయటపడుతోంది.

అంతే కాదు  వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే మంచి పేరు ఉన్న భారత్ కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. ఇపుడు ప్రపంచం కూడా సురక్షితమైన వ్యాక్సిన్ కోసం భారత్ వైపు చూడడం చైనాకు మంటగా ఉంటోందిట. బ్రెజిల్ దేశం మొదట చైనా తయారు చేసిన వ్యాక్సిన్ నే వాడింది. అయితే కనీసం యాభై శాతం ఫలితాలను సైతం ఇవ్వలేని ఆ వ్యాక్సిన్ మాకు వద్దు అంటూ చైనాకు గట్టి షాక్ ఇచ్చేసింది.

అంతే కాదు భారత్ వైపు బ్రెజిల్ చూడడమే కాదు, భారత్ బయోటిక్ తయారు చేస్తున్న  కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను పరీక్షించుకుని భారత్ ని మెచ్చుకుంది. తమకు  కోవాగ్జిన్ పెద్ద ఎత్తున కావాలంటూ భారత్ ని కోరడం, అందుకు అనుగుణంగా భారత్ స్పందించి ఇవ్వడానికి రెడీ కావడం అంటే ఇది కచ్చితంగా భారత్ కి మెచ్చుకోలు కిందనే లెక్క. మరో విధంగా చూస్తే గర్వకారణం కూడా. మరి చైనా తో సన్నిహితంగా ఉన్న బ్రెజిల్ భారత్ వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపడం, భారత్ కూడా ఓకే చెప్పడం వంటి పరిణామాలు డ్రాగాన్ కి కంటి నిండా కునుకు పట్టనీయనివేనని అంతర్జాతీయ దౌత్య నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: