పాకిస్తాన్ లో  శరవేగంగా పరిణామాలు మారిపోతూనే ఉన్నాయి. రోజురోజుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది.  ఇమ్రాన్ ఖాన్ చైనా కు అనుకూలంగా పాకిస్తాన్ మనో భావాలకు హక్కులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలతో విసిగిపోయిన ప్రజానీకం మాత్రం ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఉద్యమ బాట పడుతున్నారు. అదే సమయంలో చైనా ఆర్మీ కోసం ఏకంగా పాకిస్తాన్ ప్రజలను సైతం కాల్చి  చంపుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలలో మరింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజుకొక  ఉద్యమం తెరమీదికి వస్తుంది.



 ఈ క్రమంలోనే పాకిస్థాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్న ప్రజలను అణచి వేయడానికి అటు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది . ఇటీవలే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలమీద జరుగుతున్నటువంటి ఆర్మీ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ భారీ ఎత్తున ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తున్నారు.



 దీని వెనుక ఉన్నది మోడీ అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు   తర్వాత భారత్ లో  ఉన్న కాశ్మీర్ భూభాగంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే కాదు మౌలిక వసతులు కల్పించడం ఉద్యోగాలు  అందించడం లాంటివి చేస్తుంది మోడీ సర్కార్. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నవారికి కనీస మౌలిక వసతులు లేక పోవడమే కాదు అక్కడ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలతో స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉండటం.. అక్కడ ఎవరికీ ఉద్యోగ కల్పన కూడా లేకపోవడం తో ఇక అక్కడి ప్రజలు విసిగిపోయి ప్రస్తుతం భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: