ప్రస్తుతం మన దేశంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు జాగ్రత్తగా ఉన్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో కొన్ని షరతులు విధించే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటుంది. ప్రధానంగా ప్రజలకు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం ప్రభుత్వాలకు భారంగా మారింది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అప్పులు చేసే పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో నెలకొంది.

దీని కారణంగా నెలనెలా అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. వడ్డీలు కట్టలేని పరిస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగజారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయనే విషయం చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు డబ్బులను భారీగా ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి అనే భావనలో ఉంది. 2 వేలకు మించి పెన్షన్ పెంచవద్దు అని... దాదాపుగా ఆరేళ్ల వరకు పెంచే అవకాశం లేదని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అంతేకాకుండా రైతులకు మినహా ఏ వర్గానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వం గానీ నగదును ఇచ్చే అవకాశం లేదని 5000 దాటి ఏ ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వదు అని కేంద్రం చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇళ్ల నిర్మాణానికి మాత్రం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితికి వెళ్లే అవకాశం కూడా ఉంది. ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగకపోతే మాత్రం భవిష్యత్తులో పరిణామాలు ఆందోళనకరంగా ఉండే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: