ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధి కోల్పోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు చాలా మంది. వారి కోసం ఈ క్రింది, ఐదు స్టార్టప్ ప్లాన్లను తెలుసుకోండి.

కరోనా కారణంగా ప్రజలంతా చాలా కాలం పాటు ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కాకపోవడం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడంతో ఇంట్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. అయితే, ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటం వల్ల అందరూ తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రజలు ఎక్కువగా ఇంటి అలంకరణ ఉత్పత్తులను విపరీతంగా ఆర్డర్ చేస్తున్నారని ఈ–కామర్స్ సంస్థలు పేర్కొంటున్నాయి. కాబట్టి, మీరే స్వయంగా ఇంట్లో కొన్ని వస్తువులను తయారు చేసి ఆన్‌లైన్‌ ప్లాట్ఫార్మ్ ద్వారా అమ్మండి. దీనితో కొంత అదనపు ఆదాయాన్ని సంపాదించండి.

మీకు ఇంటర్నెట్పై బాగా పట్టు ఉన్నట్లైతే, దానినే మీ బిజినెస్కి ఉత్తమ మార్గంగా మలచుకోండి. కొన్ని ఐటీ కంపెనీలకు టెక్నికల్ సపోర్ట్ సర్వీసెస్ అందిస్తూ డబ్బు సంపాదించండి. లేదా మీకున్న సబ్జెక్ట్ నైపుణ్యాలతో విద్యార్థులకు ఆన్లైన్ ట్యుటోరియల్స్ ద్వారా పాఠాలు బోధిస్తూ డబ్బు సంపాదించండి. ఒకవేళ,- మీరు ఫైనాన్స్, గ్రాఫిక్ డిజైన్ లేదా మార్కెటింగ్‌, మొబైల్ యాప్ లను అభివృద్ధి చేయడంలో ఎక్స్పర్ట్ అయితే, మార్కెట్ పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఫీలాన్సర్గా పనిచేస్తూ డబ్బు సంపాదించండి.

ఈ నూతన సంవత్సరంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాక, మీకు ఉన్న నైపుణ్యాలను ఇతరుకు నేర్పించడం ద్వారా డబ్బు సంపాదించండి. మీరు పాటలు పాడటంలో, వంట చేయడంలో, యోగా చేయడంలో ఎక్స్పర్ట్ అయితే, మీ నైపుణ్యాలను ఆన్లైన్ ద్వారా ఇతరులకు నేర్పించండి. తద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. దీనికి గాను జూమ్, గూగుల్ మీట్ వంటి ఆన్‌లైన్ మీటింగ్ ప్లాట్ఫార్మ్లను ఉపయోగించుకోండి.

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు విసుగు చెందుతున్నారు. సినిమా థియేటర్లు, పార్క్లు, హోటళ్లు పూర్తి స్థాయిలో తెరవక పోవడంతో సుదీర్ఘకాలం నుంచి వినోదం కోసం వేచి చూస్తున్నారు. దీన్ని అందిపుచ్చుకొని, మీకున్న స్పెషల్ టాలెంట్తో వారికి ఆన్లైన్ వేదికగా వినోదాన్ని పంచవచ్చు. అవసరమైన వారికి వివిధ ఆటల్లో నైపుణ్యాలను, మెలకువలు తెలియజేస్తూ డబ్బు సంపాదించండి.

ఉద్యోగం పోయిందని చింతించకుండా ఆన్లైన్ వేదికగా వివిధ సంస్థలకు ఫ్రీలాన్సర్గా పనిచేస్తూ డబ్బు సంపాదించండి. మీ లాంటి నైపుణ్యం గల వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్న సంస్థలకు, వ్యక్తులకు ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ డబ్బు సంపాదించండి. ప్రస్తుతం, ఫ్రీలాన్సర్గా డబ్బు సంపాదించడానికి అనేక అపూర్వమైన అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఏక కాలంలో వివిధ కంపెనీలకు పనిచేస్తూ ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: