ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్టీ లు ఉన్నా వైసీపీ, బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ లు మాత్రమే ప్రజాదరణ ఉన్న పార్టీ లుగా ఇప్పటివరకు ఉన్నాయి.. అయితే ఇవి కాకుండా చాల పార్టీ లే రాష్ట్రంలో  ఉన్నాయి.. అందులో వామపక్షాలుగా ఉన్న పార్టీ లు కొంతవరకు ఫేమస్.. అందులో సిపిఐ, సిపిఎం లు ఉన్నాయి.. అయితే ఈ పార్టీ ల పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగాలేదని చెప్పాలి.. వైసీపీ ప్రభంజనం లో ఇవి ఏ మాత్రం ప్రభావం చూపలేదు. గతంలో కొద్దో గొప్పో ప్రజాదరణ కలిగి ఉన్నా ఇప్పుడు మాత్రం పూర్తిగా కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎదో ఒక పార్టీ అండ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వారికి జగన్ దిక్కు అయ్యేలా వాతావరణం కనిపిస్తుంది.. 2014 లో జగన్ తో పొత్తు లో ఉండి వామపక్షాలు మంచి పనిచేసినా 2019 లో మాత్రం పవన్ కళ్యాణ్ తో ముందుకు వెళ్లాయి.. అయితే ఇక్కడ వామపక్షాలను , జనసేన ను రెండిటిని పట్టించుకొలేదు ప్రజలు.. పవన్ కల్యాణ్ పార్టీకే చచ్చీ చెడీ ఒక్క స్థానం దక్కింది. ఇక ఎన్నికలు ముగిశాక పవన్ కల్యాణ్ బీజేపీతో జత కట్టారు. సహజంగా కాషాయం అంటే కోపంగా ఉండే కమ్యునిస్టు పార్టీలు జనసేనకు దూరమయ్యాయి.

దాంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది..  అమరావతి విషయంలో టీడీపీ కి మద్దతు గా ఉన్న వామపక్షాలు చంద్రబాబు తో అనేక సమావేశాల్లో పాల్గొని జగన్ కు వ్యతిరేకంగా కొన్ని పనులు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు క్రిస్టియన్ల పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో  వామపక్షాలు పునరాలోచనలో పడ్డాయంటున్నారు. తిరిగి జగన్ వైపునకు వారు రాక తప్పదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.మత విద్వేషాలను రెచ్చ గొడుతున్నారన్న చంద్రబాబు తో ముందుకు వెళ్లోద్దని వామపక్షాలు భావిస్తున్నాయట..

మరింత సమాచారం తెలుసుకోండి: