రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా రాజకీయం పూర్తి గా మారిపోయింది.. ఒకప్పుడు చూసిన రాజకీయాలు ఇప్పుడు లేవు.. ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియా రాజకీయాలు అయిపోయాయి. ఆ కాలంలో ఏదైనా చెప్పాలనుకుంటే మీడియా, ప్రెస్ మీట్ అంటూ కొంత హంగామా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు, ఇలా మైండ్ లో ఏది అనిపిస్తే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడమే.. అయితే ఇది మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కు అర్థం కావట్లేదు. ఇంకా ఎన్టీఆర్ కాలంనాటి రాజకీయాలతో రోజు రోజు కి వెనకపడిపోతున్నాడు..

అసలే అయన నడిపిస్తున్న టీడీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు.. భవిష్యత్ లో వస్తుందో రాదో కూడా గ్యారెంటీ లేదు.. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఇప్పుడు రాజకీయంలో ఇంకాస్త ఎక్కువ హుషారుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చంద్రబాబు పాత రాజకీయాలను చేస్తూ పాత చింతకాయ పచ్చడి ని కొత్త జాడీలో వేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఆరోజుల్లో అధికారంలోఉన్న నాయకుడిని ఎంత ఎక్కువగా విమర్శిస్తే ప్రజలు అంత ఎక్కువగా నాయకులను చూస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి నాయకులను ఎక్కువగా విమర్శించి టీడీపీ బలపడింది..

కానీ ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియా లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంతా క్లియర్ గా ప్రజలకు తెలిసిపోతుంది. అలాంటిది జగన్ ను అనవసరంగా చంద్రబాబు విమర్శిస్తున్నాడు.. ఆలా చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడు అనుకుంటున్నాడో ఏమో కానీ రోజు రోజుకి జగన్ విమర్శించడంలో ఆరితేరిపోతున్నాడు.
ఏపీలో జగన్ బదనాం అయితే కచ్చితంగా జనం టీడీపీనే ఎన్నుకుంటారని చంద్రబాబుకు ఉన్న అతి ధీమాగా కనిపిస్తోంది. పార్టీలో తప్పు ఒప్పులు సరి చేసుకుని జనాలకు గట్టి భరోసా ఇవ్వకపోతే 2019లో ఓడించిన టీడీపీనే మళ్లీ నెత్తిన పెట్టుకోవడానికి ఆంధ్ర ప్రజలు ఎందుకు ముందుకు వస్తారు అన్నది కూడా చంద్రబాబు ఆలోచించాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: