ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ కు సర్వం సిద్ధమైందని, ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 కోల్డ్ స్టోరేజ్ పాయింట్స్ పెట్టామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కర్నూల్, కడప, గుంటూరు, విశాఖలు అని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు కానటువంటి సాధారణ ప్రజలు వ్యాక్సినేషన్ కోసం కొ -విడ్ లోని రిజెస్ట్రేషన్ విభాగంలో రిజిస్టర్ చేసుకోవచ్చు..ఫోటో ఐడెంటి కూడ తప్పని సరి అన్నారు. కోటి మంది ప్రజలకు సరి పోయే వ్యాక్సిన్ సప్లై చేయడానికి ఫ్రీజర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వం నుండి ఫ్రీజర్స్ రాకపోతే లోకల్ మార్కెట్ ద్వారా టెండర్ ప్రాసెస్ లో ప్రొక్యూర్ చేయడం కోసం అన్ని చర్యలు చేపట్టాము అన్నారు. రాష్ట్రములో 100 మంది సిబ్బంది ఉన్న ప్రవేట్ హాస్పిటల్ లో కూడ సెషన్ సైట్ గా గుర్తించాము అన్నారు.
                                 రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 200హాస్పిటల్స్ ఎప్పటికే గుర్తించామని మంత్రి చెప్పారు. రాష్ట్ర స్థాయి స్టోరేజ్ పాయింట్ నుండి జిల్లా స్థాయి వ్యాక్సిన్ పాయింట్ స్టోర్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు. రానున్న రోజులల్లో ప్రజలు అందరికి వ్యాక్సిన్ సప్లై చేయడం కోసం ఐ ఎం ఏ డాక్టర్స్, ఎన్ జి ఓ సిబ్బందిని కూడ వినియోగించుకోవడం కోసం అన్ని చర్యలు తీసుకున్నాం అన్నారు. వ్యాక్సిన్ కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకోవడం కోసం జిల్లా, రాష్ట్రము అనుసంధానం చేస్తూ జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని నాని వివరించారు. టీకా కోసం 24గంటలు పని చేయడానికి 104కాల్ సెంటర్ కూడ ఏర్పాటు చేసామని ఆళ్ల నాని తెలియజేశారు.
                                                        అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో వ్యాక్సిన్‌ లబ్దిదారులను వైద్యాధికారులు గుర్తించారు.కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్ధిదారులకు కోవిన్‌ యాప్‌ ద్వారా ఎస్సెమ్మెస్సులు పంపనుంది ప్రభుత్వం.జిల్లాల వారీగా కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తే.. అనంతపురంలో 29,065, చిత్తూరులో 33,773, తూర్పు గోదావరిలో 38,128, గుంటూరులో 35,389, కృష్ణా జిల్లాలో 34,813, కర్నూలులో 33,279, ప్రకాశం జిల్లాలో 25,383, నెల్లూరులో 31,346, శ్రీకాకుళంలో 21,934, విశాఖపట్నంలో 36,694, విజయనగరంలో17,465, పశ్చిమగోదావరిలో 27,323, కడప జిల్లాలో 23,391 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: