ఉత్తరప్రదేశ్ లో  మతాంతర వివాహం చేసుకున్న అనంతరం ఆ  పెళ్లి గురించి జిల్లా మ్యారేజీ ఆఫీసర్‌కు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీసులను వారి జిల్లా కార్యాలయంలో నెల రోజులపాటు డిస్‌ప్లే పెట్టాల్సి ఉంటుంది. వారి పెళ్లిపై ఎవరైనా అభ్యంతరాలు చెబితే వాటిని  పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు పౌరుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని హైకోర్ట్  న్యాయమూర్తి వివేక్ చౌదరి తెలిపారు. అయితే  ప్రభుత్వం గతేడాది  తీసుకొచ్చిన ఈ  చట్టం విమర్శకుల పాలవుతుంది ..  ఆ చట్టం మతాంతర వివాహం  చేసుకోవాలనుకునే జంటల ప్రైవసీకి,మరియు స్వేచ్చకు భంగం కలిగిస్తోందన్న వార్తలు వినబడుతున్నాయి ... ఈ చట్టం పై కొన్ని సవరణలు కోరుతూ  ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈరోజు తీర్పును వెలువరించింది ..  ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు వెలువరించిన  తీర్పు మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఊరట కలిగించింది .. ఇకపై ఆ నోటీసులను మెజిస్ట్రేట్ కార్యాలయంలో డిస్‌ప్లేలో చేయాలా వద్దా అన్నది వాళ్లే నిర్ణయించుకోవాలని  కోర్టు తీర్పునిచ్చింది.  

అయితే పిటిషన్ను దాఖలు చేసిన ఆ  మహిళ ఇటీవల ఓ హిందూ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇందుకోసం ఆమె ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారింది. అయితే  మతం మారడం  పట్ల ఆమె తండ్రి ఒప్పుకోలేదు.. దీంతో   ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ లో లోపాలు సరిచేయడం కోసం ఆమె కోర్ట్ మెట్లను ఎక్కింది .. అలహాబాద్ కోర్ట్ లో న్యాయం జరగాలని కోరుతూ మతాంతర వివాహ ఆర్డినెస్ పై ఒక పిటిషన్ ను దాఖలు చేసింది ..  దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఇకపై మెజిస్ట్రేట్ కార్యాలయంలో నోటీసులను డిస్‌ప్లే చేయడం తప్పనిసరి  కాదని సంచలన తీర్పును వెలువరించింది ..  
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: