ఏపీలో జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ నాడు కూడా ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ఆ మాట‌కు వ‌స్తే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌తిసారి పొత్తుల‌తోనే ఎన్నిక‌ల‌కు వెళుతున్నాడు. జ‌గ‌న్ 2012 ఉప ఎన్నిక‌లు కావొచ్చు... 2014 ఎన్నిక‌లు.. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి ఓ వైపు చంద్ర‌బాబు, మ‌రో వైపు ప‌వ‌న్‌, క‌మ్యూనిస్టులు, మ‌రో వైపు బీజేపీ వీళ్లంద‌రిని ఒంట‌రిగా ఎదుర్కొని ఏకంగా 151 సీట్ల‌తో తిరుగులేని మెజార్టీతో రికార్డులు క్రియేట్ చేశారు.

ఆ మాట‌కు వ‌స్తే 2009లో నాడు చంద్ర‌బాబు, కేసీఆర్‌, క‌మ్యూనిస్టులు ఓ వైపు.. మ‌రో వైపు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీతో పాటు మ‌న తెలంగాణ లాంటి పార్టీలు క‌ల‌సి పోటీ చేసినా వైఎస్ ఒంట‌రి చేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వ‌చ్చారు. క‌ట్ చేస్తే ఇప్పుడు జ‌గ‌న్‌తో పొత్తు కోసం కొన్ని పార్టీలు త‌హ‌త‌హ లాడుతోన్న ప‌రిస్థితి ఉంది. ఏపీలో వామ‌ప‌క్షాల పరిస్థితి ఎటూ కాకుండా తయారయింది. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వామ‌ప‌క్షాలు.. అంత‌కు ముందు నుంచి ఎన్టీఆర్ ఉండ‌గా.. టీడీపీతోనే ముందుకు వెళ్లాయి.

ఇక 2009లో నాడు కేసీఆర్‌, చంద్ర‌బాబు కూట‌మిలో చేరాక అస్స‌లు అడ్ర‌స్ లేకుండా పోయాయి. ఇక 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సీపీఎం, సీపీఐ ఒక్కో స్థానంతో స‌రిపెట్టుకున్నా ఏపీలో ఆ పార్టీల‌కు అడ్ర‌స్ లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో జ‌ట్టు క‌ట్టినా కూడా ఉప‌యోగం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు త‌మ ఉనికి కోసం వామ‌ప‌క్షాలు జ‌గ‌న్ చెంత‌కే చేరే ఆలోచ‌న‌లో ఉన్నాయంటున్నారు. ఏపీలో సీపీఎం, సీపీఐ లకు గత రెండు దఫాలుగా శాసనసభలో ప్రాతినిధ్యం లేదు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి వామ‌ప‌క్షాలు మ‌ద్ద‌తు ఇస్తూ టీడీపీతో క‌లిసి న‌డిచాయి. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల్లో మాత్రం చంద్ర‌బాబుతో క‌లిసి వెళ్లేందుకు వీరు ఒప్పుకోవ‌డం లేదు. చంద్ర‌బాబు గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ అవుతోంది. ఈ క్ర‌మంలో క‌నీసం ఉనికి అయినా కాపాడుకోవాలంటే జ‌గ‌న్‌తో క‌లిసి న‌డ‌వ‌డ‌మే బెట‌ర్ అన్న నిర్ణ‌యంలో వామ‌ప‌క్షాలు ఉన్నాయంటున్నారు. అయితే జ‌గ‌న్ వీరితో పొత్తు పెట్టుకున్నా ఆయ‌న‌కు ఉప‌యోగం ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో వామ‌ప‌క్షాల క‌ల‌లు ఎలా ?  నెర‌వేర‌తాయో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: