టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విష‌యం మ‌రోసారి పార్టీలో చ‌ర్చ నీయాంశంగా మారింది. నిజానికి ఇప్ప‌టివ‌ర‌కు కూడా సోష‌ల్ మీడియాలోను, ఇత‌ర వ‌ర్గాల్లోనూ లోకేష్ కార్న‌ర్ గా అనేక కామెంట్లు విశ్లేష‌ణ‌లు వ‌చ్చేవి. కానీ, ఇప్పుడు సొంత పార్టీలోనే సీనియ‌ర్లు లోకేష్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ``మా వోడు మారే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు`` అని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో అయితే.. మ‌రింత తీవ్రంగా నే చెబుతున్నారు. లోకేష్ త‌న వ‌య‌సుకు త‌గిన‌ట్టు యువ‌త‌ను ఆక‌ర్షించే అవ‌కాశం ఉన్నా.. ఆదిశ‌గా అడుగులు వేయ‌డం లేద‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా లోకేష్ చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగం కామెంట్ వ‌ల్ల ద‌ళిత వ‌ర్గాల‌కు పార్టీ దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి  లోకేష్ నోటి వెంట ఇదే మాట వినిపిస్తోంద‌ని.. ఇంత‌కు మించి లోకేష్ ద‌గ్గ‌ర స‌రుకు లేదా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశంఉంద‌ని అంటున్నారు సీనియ‌ర్లు.   ఇక‌, ల‌క్ష కోట్లు.. ల‌క్ష కోట్లు అంటూ.. జ‌గ‌న్‌పై చేస్తున్న కామెంట్లు కూడా యూత్‌ను ఆక‌ర్షించలేక పోతున్నాయ‌ని అంటున్నారు.  అదేవిధంగా శుక్ర‌వారం శుక్ర‌వారం అంటూ చేసే కామెంట్ల‌కు కూడా లైకులు రావ‌డం లేద‌ని చెబుతున్నారు.

 ఇక‌, ఇప్పుడు కాక‌పోతే.. రేపైనా.. బీజేపీతోక‌లిసి ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు ల‌క్ష్యంగా పెట్టుకుని ఆదిశ‌గా అడుగులు వేస్తుంటే.. లోకేష్ మాత్రం 'జ‌గ‌న్ మోదీ రెడ్డి..' అంటూ చేస్తున్న మెసేజ్ లతో బీజేపీ నేత‌లు మండిప‌డుతుండ‌డాన్ని సీనియ‌ర్లు ప్ర‌స్తావిస్తున్నారు. ఇలా అయితే.. బీజేపీ ఎలా చేరువ అవుతుంద‌ని.. మా వోడికి.. మెద‌డు కూడా ప‌నిచేయ‌ట్లేద‌నుకుంటా.. అనుకుంటా.. అని కృష్ణాజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ  వ్యాఖ్యానించారు.

ఏదైనా అతిగా అన‌డం, అనుచితంగా రియాక్ట్ అయిపోవ‌డం  మంచిది కాద‌ని.. ఈ విష‌యంలో లోకేష్ మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు గుస‌గుస‌లాడుతున్నారు. కానీ, ఎవ‌రూ కూడా ధైర్యం చేసి చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. ఆయ‌న ఎవ‌రి మాటా వినిపించుకోరు.. విన‌రు కాబ‌ట్టే..! 

మరింత సమాచారం తెలుసుకోండి: