దాదాపు గత ఏడాది కాలంగా ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తొలి దశలో దేశంలోని 3 కోట్ల మంది హెల్త్‌ కేర్, ఫ్రంట్‌ లైన్ వర్కర్లకు ఉచితంగా వ్యాక్సినేషన్ అందించనున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. మరి సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్రం ఒకవేళ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించలేకపోతే.. ఢిల్లీ ప్రజలకు తాము ఉచితంగా వ్యాక్సినేషన్ చేయిస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయించుకునే స్థోమత ఉండదని.. అందుకే అందరికీ ఉచితంగా కరోనా టీకా వేయించాలని ఇదివరకే కేంద్రాన్ని కోరానని కేజ్రీవాల్ తెలిపారు.

‘‘కేంద్రం ఏం చేస్తుందో చూస్తాం. ఒక వేళ అవసరమైతే.. కేంద్రం ఉచితంగా టీకా వేయించలేకపోతే.. ఢిల్లీ ప్రజలకు మేం ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తాం’’ అని కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సినేషన్ గురించి రూమర్లు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. అన్ని ప్రొటోకాల్స్, జాగ్రత్త చర్యలను అనుసరించే కేంద్రం మరియు ఆరోగ్య శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చారని ఢిల్లీ సీఎం తెలిపారు. కాబట్టి వ్యాక్సిన్ విషయంలో అనుమానాలు వద్దని.. టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్ నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 89 కేంద్రాల్లో శనివారం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇటీవలే జనవరి ఆరంభంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోని న్ని రాష్ట్రాల, వర్గాల ప్రజలు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: