ఎవరైనా ఫొటోలు తీసుకుంటుంటే పక్కన వాళ్ళు చూసి నవ్వుకోవడం లేదా అక్కడ నుంచి పక్కకు పోతారు. అయితే జంతువులతో ఫోటో తీసుకోవాలనీ చాలా మంది అనుకుంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉండటంతో మరీ ఎక్కువగా ఫోటోలు, వీడియో లు తీయడం వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం చేస్తుంటారు.కానీ వాటిని చిరాకుకు గురి చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటేనే అసలు సమస్య. ఇక జంతువుల ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఈ సోదంతా ఏంటి అనుకుంటున్నారా.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియా లో వైరలవుతోంది. 


ఆ వీడియో ఏనుగుకు సంబంధించినది. ఫోటోలంటే సిగ్గుపడే ఆ ఏనుగు తనను ఫోటోలు తీయొద్దని చెప్పమంటూ మావటి దగ్గరకి వెళ్లి ఎంతో ముద్దుగా చెప్పుకుంటుంది. ఆ ఏనుగును అతను ఒపిస్తాడు.. ఆ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. జంతు ప్రేమికులను ఎక్కువగా ఆకట్టుకుంది. అసలు విషయానికొస్తే.. ఈ ఘటన తమిళనాడు లో వెలుగు చూసింది..


తిరుచిరాపల్లి లోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం లో తీశారు. ఇక దీనిలో కనిపించేది ఆండాల్‌ అనే ఆడ ఏనుగు. ఇక వీడియో లో ఓ గుమ్మంలో మావటి కూర్చుని ఉంటాడు. ఏనుగు అతడి దగ్గరకు వెళ్లి తన భాషలో మావటితో 'ఫోటోలు తీయొద్దని చెప్పు.. నాకు సిగ్గేస్తుంది' అని చెప్తుంది. అతను ఏనుగు తోండాన్ని పట్టుకొని వాళ్ళు నితో ఫోటో దిగాలని ఆశపడుతున్నారు అని అంటాడు.మావటి అడిగిన ప్రశ్నలకు ఏనుగు తల ఊపుతూ సమాధానాలు ఇవ్వడం వీడియోలో హైలెట్‌. ఏనుగు-మావటిల మధ్య జరిగిన సంభాషణ తీరు చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. మనుషులను జంతువులు ఒకసారి ప్రేమిస్తే ఇక ప్రాణాలు పోయిన ఆ అభిమానాన్ని అలానే కొనసాగిస్తారు...అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: