దేశ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు మరింత జోరుగా సాగుతున్నాయి. తమిళనాడులో కూడా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కుల , మత బేదాలు లేకుండా అందరూ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలకు జాతీయ స్థాయిలో నేతలు కార్యకర్తలు పాల్గొన బోతున్నారని సమాచారం.
తమిళనాడులో గురువారం జరిగే సంక్రాంతి వేడుకలకు పలువురు జాతీయ నేతలు హాజరు కానున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు తమిళనాడులో జరిగే సంప్రదాయ పండుగకు హాజరవుతుండడంతో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్ ‌తో పాటు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. చెన్నై మధుర వోయల్‌లో జరిగే సంబురాల్లో జేపీ నడ్డాతో పాటు పార్టీ నేత మురుగన్‌ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని పార్టీ నేతలతోనూ సమావేశం కానున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ చెన్నైలోని మూలకాడై సమీపంలో జరిగే వేడుకల్లో పాల్గొని అక్కడి ప్రజలను ఉద్దేశించి వాళ్ళు ప్రసంగించనున్నారు.

 ఎన్నికల ముందు వాళ్ళు పర్యటించడం పై పలు రాజకీయ చర్చలు జరుగుతున్నాయి..మధురై జిల్లా అవన్యపురంలో జరిగే జల్లికట్టు ఉత్సవం లో రాహుల్‌ గాంధీ పాల్గొని, వేడుకల ను తిలకించనున్నారు. ఆయన రాకతో కాంగ్రెస్ ‌తో పాటు డీఎంకే నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ ప్రాచీన సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు ను వీక్షించేందుకు రాహుల్‌ వస్తుండడం వచ్చే ఎన్నికల్లో తమకు కలిసొచ్చే అంశంగా ఉందని రెండు పార్టీలు స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు. ఈ సంక్రాంతి వేడుకలు మరి వారికి ఏ మాత్రం కలిసి వస్తాయని చూడాలి.. మొత్తాని కి తమిళనాడు జాతీయ నేతల రాకతో హోరెత్తుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: