సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో  పండుగ శోభ మాములుగా ఉండదు ..  సంక్రాంతి మన ఇంట్లోకి కొత్త కాంతులను తెస్తుంది .. రంగురంగుల ముగ్గులతో ఇంటి ఆవరణని అందముగా ముస్తాబు చేస్తూ , నోరూరించే పిండివంటలతో సంక్రాంతి పండగా ప్రతి ఒక్కరి జీవనంలోకి  కొత్త కళని తీసుకొస్తుంది .. అంతేకాదు సంక్రాంతి పర్వదినమున  అల్లుళ్ళు , బంధువులతో ఇల్లంతా  కళకలాడతాయి .. ఇక సంక్రాంతి వస్తుందంటే అయ్యప్ప భక్తులకు ఎంతో ముఖ్యమైనది ..  
ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినమున  అయ్యప్ప  భక్తులకు మకరజ్యోతి దర్శనం లభించనుంది. అయ్యప్పస్వామికి మకర సంక్రాంతి ఎంతో ఇష్టమైనది. అందుకే  దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమల ను దర్శించుకుని, మకరజ్యోతిని వీక్షించి అనుభూతి పొందాలని  ఆశపడుతుంటారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికి ఆలయ అధికారులు శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. శబరిమలకు వచ్చే భక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని సూచించారు. అంతేకాకుండా భక్తులు వారి వెంట  కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని అప్పుడే  లోనికి అనుమతిస్తామని తెలిపారు ... ఇక  మకర జ్యోతి దర్శనం అనంతరం ఈ నెల  20న శబరిమల ఆలయాన్ని మూసివేస్తామని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డ్ వెల్లడించింది.

మకరజ్యోతి దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని  అయ్యప్పభక్తుల నమ్మకం. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి భక్తులకు దర్శనం ఇవ్వనుంది  .. . కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  మకర జ్యోతి  దర్శనం కోసం  భక్తులు ఎదురు చూస్తున్నారు. మకరజ్యోతిని వీక్షించేందుకు ట్రావెన్స్‌కోర్‌ దేవస్థానం శబరిమల తో పటు చుట్టుపక్కల ప్రాంతాలలోను అన్ని ఏర్పాట్లు చేసింది ..  మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేపడుతారు. మకరజ్యోతి కనబడగానే అయ్యప్ప స్మరణతో శబరిమల మారుమ్రోగుతుంది  .. ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు అయ్యప్ప భక్తులకు  మకరజ్యోతి దర్శనమిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: