మన దేశంలో ప్రతి ఏటా పోలియో టీకాలు వేస్తారు. పోలియో వ్యాధి రాకుండా ఉండేందుకు 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇస్తారు. ఐతే ఈ సారి జనవరి 17న పోలియో చుక్కలు వేయాలని అనుకున్నారు.దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం కేంద్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్ధలు తయారు చేసిన కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లను ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రతీ ఏటా జనవరి 17వ తేదీన జరగాల్సిన పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీల్లో కేంద్రం మార్పులు చేసింది.

కరోనా తొలి దశ వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత జనవరి 31న పోలియో టీకాల కార్యక్రమం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నారు.జనవరి 16 నుంచే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా మొదలు కానుంది. మొదటి దశ వ్యాక్సినేషన్‌ను ఆ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కావడం..దానికి పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమైన నేపథ్యంలో... పోలియో ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్‌ను తదుపరి ప్రకటన వరకు వాయిదా వేసింది.కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కారణంగా దేశ ఆరోగ్య సేవల లభ్యతలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులను కూడా వినియోగించుకుంటోంది. దీంతో భారీ ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, ఇతర సిబ్బందిని కూడా వినియోగిస్తోంది. అదే సమయంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ తక్షణావసరంగా మారింది. దీంతో సాధారణ వైద్య సేవలకు కూడా ఆటంకం కలిగే పరిస్దితి ఉంది. అలాగే పల్స్‌ పోలియో కార్యక్రమంపైనా ప్రభావం పడుతోంది.

దేశవ్యాప్తంగా 2934 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధానుల నుంచి ఆయా కేంద్రాలకు టీకాలను తరలిస్తున్నారు. టీకా కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తారని తెలుస్తోంది. ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేస్తారు.తొలి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్‌లు ఇచ్చాక.. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వస్తారు. ప్రస్తుతానికి కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లలో తమకు నచ్చిన టీకాను ఎంచుకునే అవకాశం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఏది అందుబాటులో ఉంటే దాన్నే వేసుకోవాలి. కోవిడ్ వాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: