ఏపీలో ఇపుడు సమ్మర్ రాకుండానే వారావరణం హీట్ ఎక్కుతోంది. నిజానికి కొత్త ఏడాది రెండవ రోజునే రామతీర్ధం యాత్ర చేసి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారి ఏపీలో పొలిటికల్ సీన్ ని మార్చేశారు. దాని నుంచి బయటపడడానికి అధికార పార్టీ చాలానే చేయాల్సివచ్చింది. ఇప్పటికీ చేస్తోంది కూడా.

ఇదిలా ఉంటే టీడీపీ కానీ ఇతర విపక్షాలు కానీ ఏపీలో దూకుడు పెంచడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటి అంటే తొందరలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరగాల్సి వుంది. ఇక రెండున్నరేళ్లుగా పెండింగులో ఉన్న లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈ ఏడాది ఎన్నికల యుధ్ధం చాలా రసవత్తరంగా సాగనుంది. దానికి రెడీ అయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచేశాయి.

ఇదిలా ఉంటే వరసగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఒక ఎన్నిక మీద మరో ఎన్నిక రిజల్ట్ భారీ ప్రభావం చూపించడం ఖాయం. ముందు ఏ ఎన్నిక వస్తే దానిలో విజయం సాధించిన పార్టీకి తరువాత ఎన్నికలు క్యాట్ వాక్ అవుతాయి. జనాభిప్రాయం కూడా తేటతెల్లం అవుతుంది. ఈ విజయసూత్రం తెలిసిన అధికార వైసీపీ, దాని అధినేత జగన్ లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే తిరుపతి ఉప ఎన్నిక జరిగేలా చూడాలనుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అంటే టీడీపీకి నల్లేరు మీద బండి నడక లాంటిది. ఎందుకంటే  గత ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ రెండు లక్షల 28 వేల భారీ ఓట్ల తేడాతో గెలిచింది. ఈసారి ఎటూ అధికారంలో ఉంది. దాంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో సులువుగా గెలుపు సాధిస్తామని వైసీపీ భావిస్తోంది.

దాంతో లోకల్ బాడీ ఎన్నికలను సాంకేతిక కారణాలతో వెనక్కి నెట్టి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను ముందు జరిగేలా చూసుకోవాలనివ్ జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. హై కోర్టు తీర్పు కనుక ఎన్నికల సంఘానికి అనుకూలంగా రాకపోతే లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే వీలు ఉండదని అంటున్నారు. ఇక తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 16న చనిపోయారు. అంటే మరో రెండు నెలలల వ్యవధిలో కచ్చితంగా తిరుపతి ఉప ఎన్నిక జరిగి తీరాలి. దాంతో జగన్ వేస్తున్న ఎత్తులతో తిరుపతి ఉప ఎన్నిక ముందుగా జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ వైసీపీ విజయ ఢంకా మోగిస్తే కచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల మీద విపరీత‌మైన ప్రభావం ఉంటుంది. అపుడు టీడీపీకి భారీ డ్యామేజ్ ఖాయమని అంటున్నారుు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: