గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇప్పటికీ చంద్రబాబు మింగుడు పడట్లేదని ఇటీవలే అయన చేసిన వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.. అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు రెండుళ్లు కావొస్తుంది. ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ ని తరిమి కొట్టి వైసీపీ ని ఏరికోరి మరీ గద్దె ఎక్కించారు.. మొత్తం 175 సీట్లకు గాను 151 సీట్లు వైసీపీ కి కట్టబెట్టి అధికారం జగనప్పగించారు. ఈ తీర్పు తో అప్పుడు బ్లాంక్ అయిన చంద్రబాబు మైండ్ ఇప్పటివరకు కోలుకోలేదు. ప్రజలు తనను ఎందుకు ఆదరించలేదు అని ఇప్పటికీ జుట్టు పీక్కుంటు ఆలోచిస్తున్నాడు..

నిజానికి ఈ ఎన్నికల్లో ఓటమికి కారణాలు అవినీతి, ప్రజల నమ్మకం కోల్పోవడం అని చంద్రబాబు బాగా తెలుసు.. కానీ ఎదో గాలివాటంగా జగన్ గెలిచాడని పైకి చెప్తూ తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రెండేళ్లుగా జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లి పార్టీ ని బలపరుచుకునే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు.. ఆయనకు తోడుగా నాయకులు కూడా ఎవరు టీడీపీ ని పట్టించుకోలేదు.. ఫలితంగా టీడీపీ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావడం అనుమానంగానే ఉంది..

ఈనేపథ్యంలో ఆయన ఇటీవలే కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ఓ ఆశ్చర్యకరమైన ప్రశ్న ని తనకు తానే వేసుకున్నాడు. ‘‘ప్రజలు పూనకం వచ్చినట్లు జగన్‌కు ఓట్లు వేశారు. నేను ఏమి తప్పు చేశానో తెలియడం లేదు’’ అంటూ నిట్టూర్చారు. ప్రజలు అభివృద్ధి చెందాలని కృషి చేశాను.. అదే తప్పైతే నన్ను క్షమించండి’’ అంటూ కూడా చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కారు. టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని, చంద్రబాబుపై ఇంకా అంతో ఇంతో నమ్మకం ఉన్న తెలుగుదేశం పార్టీలోని కొంత మంది కార్యకర్తలకు తాజాగా బాబు చేసిన వ్యాఖ్యలతో ఓ క్లారిటీ వచ్చేసింది. ఏ పార్టీ అయిన ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అన్వేషించి.. తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు పని చేస్తుంది. కానీ బాబు గారు మాత్రం చేసిన తప్పులు ఏమిటో తెలిసినా.. వాటిని ఒప్పుకునేందుకు మాత్రం మనసు రావడంలేదని  అయన చేసిన వ్యాఖ్యలతో తమ్ముళ్లకు కూడా అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: