టీడీపీ పార్టీ నేతలకు ఎలాంటి రాజకీయం చేయాలో కూడా తెలీట్లేదు. కుల , మత రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ పార్టీ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం గా ఎదగడం, బలపడడం మొదటినుంచి వస్తున్న అలవాటు.. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన రామతీర్థం ఘటన ను రాజకీయం చేసి బలపడాలని చూస్తుంది.. అనవసర వ్యాఖ్యలు చేసి టీడీపీ పార్టీ భవిష్యత్ కి తనకు తానే కొరివి అంటిచుకుంది. చంద్రబాబు హిందువుల మెప్పు పొందపోయి క్రిస్టియన్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు..

దీంతో ఒక్కసారిగా క్రిస్టియన్ కమ్యూనిటి లు  చంద్రబాబు పై ధ్వజమెత్తాయి.. అన్ని వర్గాల క్రిస్టియన్ లు చంద్రబాబు పై ప్రతి విమర్శ చేసి దుయ్యబట్టాయి.. అంతేకాదు టీడీపీ పార్టీ లోని క్రిస్టియన్ నాయకులు సైతం తమ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ గుడ్ బాయ్ చెప్పేశారు. ఇక్కడితో జరిగిందేదో జరిగింది అనుకోకుండా టీడీపీ పార్టీ మరింత తెగిస్తుంది. ఆలయాల దాడులపై జగన్ కి కూడా నోటిసులు పంపాలని డిమాండ్ చేస్తుంది టీడీపీ పార్టీ..

ముఖ్యమంత్రి వద్ద ఆలయాలపై దాడులకు సంబంధించి పూర్తి సమాచారం ఉందని ఆయన మాటల ద్వారా తెలుస్తోందని.. తక్షణం ఆయనకు నోటీసులు జారీ చేసి.. వివరాలు తెలుసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆలయాలపై దాడులు చేస్తున్నవారు తనకు తెలుసని జగన్‌ అన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా.. డీజీపీ వెంటనే సీఎంకు నోటీసు ఇచ్చి…ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలని కోరారు. తన లేఖతో లేఖతో పాటు జగన్‌ ప్రసంగ వీడియోను కూడా జత చేశారు. మాజీ పోలీసు అధికారి అయిన వర్ల రామయ్య.. ఏయే సెక్షన్ కింద జగన్‌కు నోటీసులివ్వాలో కూడా వివరించారు. వర్ల రామయ్య ఇలా టార్గెట్ చేయడానికి కారణం గతంలో.. చంద్రబాబుకు డీజీపీ లేఖలు రాయడమే. చిత్తూరు జిల్లాలో జరిగిన దళిత యువకుడి అనుమానాస్పద మృతి… ఇతర కేసుల్లో.. చంద్రబాబు రాసిన లేఖలకు ఆధారాలివ్వాలని డీజీపీ ప్రత్యత్తురం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: