ఇంటర్నెట్ డెస్క్: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1 నిందితురాలు అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురైంది. ఆమె రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో ఆమె మళ్లీ జైలుకు పయనమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నంతో అఖిలప్రియ కస్టడీ ముగియడంతో పోలీసులు ఆమెను న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. అంతకంటే ముందు గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అనంతరం న్యాయమూర్తి ఇంటికి తీసుకు వెళ్ళారు. అయితే కేసులో అఖిలప్రియకు వ్యతిరేకంగా ఆధారాలు ఎక్కువగా ఉండడంతో ఆమెకు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో పోలీసులు ఆమెను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. 


ఇప్పటికే 3 రోజుల నుంచి అఖిలప్రియను విచారిస్తున్న పోలీసులు 300లకు పైగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అసలు కిడ్నాప్‌ ఎలా జరిగింది? ఎవరెవరు ఇందులో చేతులు కలిపారు? ఎలా స్కెచ్‌ వేశారు? కాస్టూమ్స్‌ నుంచి ఎస్కేప్‌ వరకు ఎలా ప్లాన్ చేశారు? వంటి అనేక ప్రశ్నలు అడిగి విషయం రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే విచారణలో కిడ్నాప్ కు సంబంధించిన కీలక విషయాలు బయటకొచ్చాయి. కిడ్నాప్ లో ఎవరు ఏ రోల్‌ పోషించారో తెలిసిపోయింది.


 ఇక భార్గవ్‌ రామ్‌, గుంటూరు శీనును పట్టుకోవడమే మిగిలింది. ఈ కిడ్నాప్ కేసులో భార్గవరామ్, మాదాల శ్రీను, చంద్రహాస్ ప్రధాన నిందితులుగా ఉండగా.. అఖిలప్రియ వీరందరికీ మాస్టర్ మైండ్ గా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అఖిలప్రియ సోదరుడు జగత్ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఫైనల్ దశకు చేరింది. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఈ విషయం వెల్లడైంది. సీసీ ఫుటేజీ, కాల్ డేటాలను కూడా పరిశీలించిన తరువాత పోలీసులు తదుపరి స్టెప్ తీసుుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: