మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తాము చనిపోయిన కూడా పది మందికి వెలుగు నివ్వాలని కోరుతున్నారు.. అలాంటి వాళ్ళు ఈ భూమీద అతి తక్కువ మందే ఉన్నారు. చావు చివరి అంచుల వరకు వెళ్లిన వాళ్ళు చాలా మంది వారి శరీర అవయవాలను దానం చేస్తారు. మరొకరు జీవితాల్లో వెలుగులు నింపుతారు.. కానీ ఇక్కడ 20 నెలల చిన్నారి ఆర్గాన్స్ ఐదు మంది చిన్నారులకు ప్రాణం పోసింది. ఆ చిన్నారి ఇప్పుడు వారి పాలిట దేవత అయ్యింది. 



వివరాల్లోకి వెళితే... 20 నెలలకే నిండు నూరేళ్లూ నిండాయి. బోసి నవ్వులతో, బుడి బుడి అడుగుల తో కన్నవారి కళ్లల్లో ఆనందం నింపాల్సిన ఆ పసిపాప.. అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితేనేం.. తాను వెళ్తూ వెళ్తూ మరో ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ధనిష్తా అనే ఆ 20 నెలల చిట్టితల్లి.. ఇప్పుడు దేశం లోనే అత్యంత పిన్న వయసు అవయవ దాతగా నిలిచింది. ఈ నెల 8న బాల్కనీలో నుంచి కింద పడిన ధనిష్తాను గంగారామ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఈ నెల 11న ఆ పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పారు.



దాంతో ఆ చిన్నారి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. దాదాపు రెండేళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న కూతురు కళ్ళ ముందే చనిపోవడంతో భాదను భరించలేక పోయారు. అయితే వారి బిడ్డ అవయవాలను మరో ఐదు మందికి దానం చేయాలని భావించారు. అవయవాలే ఐదుగురి ప్రాణాలను కాపాడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలbను ఐదుగురు పేషెంట్లకు ఇచ్చారు. తాము ఆసుపత్రి లో ఉన్న సమయంలో అవయవాల కోసం చూస్తున్న పలువురిని కలిశామని ఆశిశ్ కుమార్ చెప్పారు. మా పాప చనిపోయిన కూడా ఐదుగురిలో బ్రతికే ఉంటుందని చిన్నారి తండ్రి అన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: