న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం పాకేసి కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 కోట్లకు పైగా కరోనా బారిన పడ్డారు. ఇక ఎంతో కాలం నుంచి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ కూడా మార్కెట్‌లోకి వచ్చేసింది. ఏ దేశానికాదేశం తమకు చెందిన వ్యాక్సిన్లకు అనుమతులను జారీ చేశాయి. ఇక భారత ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ బయటకు రావడం.. ప్రభుత్వం అత్యవసర అధికార వినియోగానికి అనుమతులను జారీ చేయడం జరిగిపోయింది.

అయితే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అయితే ఇంకా మొదలు కాలేదు. దేశం మొత్తం ఒకేసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే పూణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాక్సిన్ బాక్సులు చేరుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాక్సిన్ బాక్సులు చేరుకోవడం.. వాటిని అన్ని జిల్లాలకు తరలించడం జరిగిపోయింది. జనవరి 26న దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆన్ లైన్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది.

తొలిరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఒక్కో టీకా కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటగా వీరందరికి వ్యాక్సిన్ డోస్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలన కార్యక్రమం జరగనుంది. ఎక్కడా ఏ ఇబ్బంది తలెత్తకుండా ఆన్ లైన్ ద్వారా అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణలు జరుపుతారు. అంతేకాకుండా నిరంతర ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఓ  ప్రత్యేక కాల్ సెంటర్‌ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: