ఆయన దేశానికి హోం మంత్రి. కేంద్రంలో నంబర్ టూ. ఇక బీజేపీలో బలమైన నాయకుడు. మోడీ తరువాత అత్యంత శక్తివంతమైన నేత. అటువంటి హోం మంత్రి ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇక ఆయన మీటింగ్ విషయంలో అడ్డు పెట్టే తాహతు ఎవరికైనా ఉంటుందా. వినడానికైనా అది నమ్మేలా ఉందా.

అంటే ఉంది అనే అంటున్నారు. హోం మంత్రి అమిత్ షా మీటింగ్ ఈ నెల 17న అంటే ఆదివారం కర్నాటక రాష్ట్రంలోని బెలగావిలో నిర్వహించేందుకు  బీజేపీ నేతలు అన్ని రకాలైన ఏర్పాట్లను చేస్తున్నారు. లక్షలాది మందితో ఈ మీటింగ్ ని ధూం ధాం గా చేయడానికి కమలదళాలు రెడీ అయిపోయాయి. ఏకంగా మూడు లక్షల మందితో ఈ మీటింగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీఐ కార్యకర్త భీమప్ప రంగంలోకి దిగారు. దేశంలో కరోనా ఒక వైపు ఉందని ఈ సమయంలో మూడు లక్షల మందితో మీటింగ్ అంటే ఎలా అనుమతిస్తారు అంటూ భీమప్ప చక్కనైన  లాజిక్ పాయింటే తీశారు. ఆయన అంతటితో ఊరుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శికి లేఖ రాశారు. తక్షణం ఆలాంటి సభకు అనుమతులు రద్దు చేయాలని సూచిందారు.

బెళగావిలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతున్నాయని,  ఇప్పటికి 26 వేలకు పై చిలుకు  కేసులు నాలుగు వందల దాకా జనాలు మరణాలు  సంభవించాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోకపోతే హై కోర్టుకు కూడా వెళ్తామంటూ హెచ్చరించారు. అమిత్ షా కి ఒక న్యాయం. అందరికీ మరో న్యాయమా అని ఆయన నిలదీస్తున్నారు. మరి చూడాలి షాకే షాక్ ఇచ్చే ఆర్టీఐ భీమన్న బలం ఎంతో. ఏది ఏమైనా దేశంలో ఇంకా కరోనా ఉందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలే ఇలాంటి సభలకు అనుమతులు ఇస్తే మళ్ళీ సెకండ్ వేవ్ కనుక వస్తే తట్టుకోగలరా అని  వైద్య నిపుణులు సైతం అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: