ఏపీలో మూడు రాజధానుల వివాదం న్యాయ సమీక్షలో ఉంది. ఈ కేసు విచారణ జరిగి తీర్పు రావడానికి కనీసంగా నాలుగు నెలలు పట్టవచ్చు అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని, ఈ విషయంలో ఏ డౌట్లూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ విశాఖకు రాజధాని రావడం ఖాయమని కూడా అంటున్నారు. ఈ క్రమంలో విశాఖకు రాజధాని కనుక వస్తే అవసరం అయిన పాలనా  భవనాలు ఉన్నాయా లేవా అన్న దాని మీద ఇపుడు చర్చ సాగుతోంది. దీని మీద ప్రభుత్వ అధికారులు చాలా సైలెంట్ గా కసరత్తు చేస్తున్నారు అంటున్నారు. విశాఖలో క్రిష్ణా రివర్ బోర్డ్ ఏర్పాటు చేయనున్నారు. దానితో పాటు రాష్ట్ర స్థాయి భవనాలు వరసగా విశాఖకు  వస్తాయని అంటున్నారు.

వీటి విషయంలో ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలన్న దాని మీద చర్చలు సాగుతున్నాయి. కొన్ని చోట్ల  స్థలాన్ని లీజ్ కి తీసుకుని భవనాలు నిర్మించడం మరి కొన్ని చోట్ల భవనాలు తీసుకోవడం వంటివి చేయాలనుకుంటున్నారు. అదే విధంగా మరో వైపు చూస్తే సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం కూడా విశాఖలో భవనాలు గుర్తించారని అంటున్నారు. ఇక మంత్రుల అఫీసుల కోసం భవనాలు కూడా వెతుకుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ప్రభుత్వం వద్ద స్థలంలోనే భవనాలు కట్టి చాలా వరకూ సర్దుబాటు చేయాలని కూడా అలోచన చేస్తున్నారుట. మొత్తం మీద ప్రభుత్వం విశాఖ రాజధాని విషయంలో సీరియస్ గానే ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య సుప్రీం కోర్టు పార్లమెంట్ నూతన భవనం నిర్మాణం విషయంలో చేసిన కామెంట్స్ ఇచ్చిన తీర్పుతో వైసీపీ నేతలలో ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు. పాలనా వ్యవహారాల్లో కోర్టులు జోక్యం ఉండదని కూడా నమ్ముతున్నారు.  చూడాలి మరి ఎపుడు విశాఖకు రాజధాని షిఫ్ట్ అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: