జనసేన పార్టీ ఏ సమయంలో బీజేపీ తో పొత్తుకు చేయి కలిపిందో కానీ అప్పటినుంచి జనసేన వాయిస్ ప్రజలకు పెద్దగా వినపడడం లేదు.. బీజేపీ, జనసేన ద్వయంలో బీజేపీ పార్టీ పైచేయి సాధిస్తుందని వారు చేసే చర్యలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది.. ఇప్పటికే జనసేన ను గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొననీయకుండా చేసింది. ఇప్పుడు తిరుపతిలోనూ బీజేపీ నే  పోటీ చేసేలా కనిపిస్తుంది. దీంతో జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.. ఇలా ప్రతి దాంట్లో పొత్తు అని చెప్పి తమను వెనక్కి తగ్గేలా చేయడం చూస్తుంటే తొందరలోనే పొత్తుకు స్వస్తి చెప్పాలని జనసేన భావిస్తోందట..

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగినా ఆలయాల దాడులను పరిశీలించే విధంగా బీజేపీ ఒక యాత్ర ను ప్రారంభిస్తుంది. రామరథయాత్ర పేరుతో త్వరలో మొదలవుతున్న ఈ యాత్ర లో రామతీర్థం తో పాటు రాష్ట్రంలోని దాడులు జరిగిన  అన్ని ఆలయాలను పరిశీలిస్తాయట. అయితే దీనిలో జనసేన ను భాగస్వామ్యం చేయలేదు బీజేపీ.. జనసేన ను సంప్రదించకుండానే, వారిని పరిగణలోకి తీసుకోకుండానే ముందుకు సాగుతుంది.. వాస్తవానికి పొత్తు పెట్టుకుంటున్న సమయంలో ఏపీలో రాజకీయంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనుకున్నా…జనసేనతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్న ఓ కట్టుబాటు పొత్తు సమయంలోనే పెట్టుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్… మొదట్లో తాను ప్రకటించిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

కానీ బీజేపీ మాత్రం భవిష్యత్ ప్రణాళికలను తమతో సంప్రదించకుండానే ముందుకు పోవడం వారిలో నిరాశతో పాటు ఆగ్రహాన్ని కలగజేస్తుంది. మొదటినుంచి బీజేపీ శైలి ఇలానే ఉంది. కాకపోతే జనసేన అధినేత కు అర్థం కావడానికి ఇన్ని రోజులు పట్టింది.. అసలే పార్టీ బలం అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో పొత్తు కు వెళ్లి తప్పు చేయడమే కాకుండా బీజేపీ ని గుడ్డిగా నమ్మి జనసేన పెద్ద పొరపాటు చేసింది.. ఇప్పటికైనా మిగిలిన సమయాన్ని వృధా చేయకుండా జనసేన బలోపేతానికి రంగం సిద్ధం చేసుకుంటే మంచిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: