ఏపీ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న తీరును చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు జగన్ కే అధికారం కట్టబెట్టేలా ఉన్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు.. ఎన్నికల ప్రచార సమయంలో ఏదైతే చెప్పాడో అది అక్షరాలా చేసి చూపెడుతున్న జగన్ మేనిఫెస్టో లో లేనిది కూడా చేస్తూ ప్రజల మన్ననను పొందుతున్నాడు. గత ప్రభుత్వాలకంటే భిన్నంగా దూకుడుగా ముందుకు వెళుతున్నాడు పింఛ‌న్ల పెంపు, పేద‌ల‌కు ఇళ్లు, వాహ‌న మిత్ర.. ఇత్యాది అనేక ప‌థ‌కాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు రోజు రోజు కి విమర్శకుల ప్రశంశలు అందుకుంటున్నాడు.

ఏ ఒక్కవర్గాన్ని కూడా అన్యాయం చేయకుండా అన్ని వర్గాల ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడం కోసం నడుంబిగించారు.  ఏ ప్రభుత్వమైనా మధ్య తరగతి కుటుంబాలపై దృష్టి పెట్టాలి.. ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతం ఉంది మధ్య తరగతి కుటుంబాలే.. వారు ఎటువైపు మొగ్గితే వారికే అధికారం చేజిక్కించుకుంటుంది.. అయితే జగన్ ఇప్పుడు వారి గురించి ఆలోచించడం వైసీపీ కి మంచి పరిణామ అని చెప్పొచ్చు..

ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ వీరిని ఆక‌ట్టుకునేందుకు పెద్దగా ఎలాంటి ప్రయత్నం చేయ‌లేదు. పైగా పెట్రోలు ధ‌ర‌ల పెంపు, భూమి శిస్తుల పెంపు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెంపు వంటి వాటితో మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల‌పై భారాలు మోపుతున్నార‌నే ప్రచారం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఈ క్రమంలో వెంట‌నే మేల్కొన్న జ‌గ‌న్ స‌ర్కారు.. మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయ‌డం ప్రారంభించింది. క్లియర్ టైటిల్ పేరుతో తక్కువ ధరలోనే ప్లాట్ లను మధ్య తరగతి కుటుంబాలకు ఇవ్వాలని చూస్తుంది.  ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ప్రభుత్వమే ఫ్లాట్ల‌ను ఇస్తే.. ఇది రాష్ట్రంలో రికార్డు కార్యక్రమ‌మే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: