ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగను పురస్కరించుకొని  టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  గోమాతల గొప్పతనం గురించి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయం గురించి, భక్తులకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చెప్పట్టారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. 

ముందుగా మున్సిపల్‌ స్టేడియంలోని స్టాల్స్ ను పరిశీలించిన ఆయన.. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.  అయితే ఇక్కడ చోటు చేసుకున్నా ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సి‌ఎం జగన్ పై గౌరవాన్ని మరింత పెంచింది.  ఓ మూగజీవానికి దెబ్బ తగలకుండా తన చేతిని అడ్డుపెట్టి  సీఎం జగన్ మరో సారి తన పెద్ద మనసును చాటుకున్నారు. 

వివరాల్లోకి వెళితే.. గోపూజ మహోత్సవంలో స్టాల్స్ ను పరిశీలిస్తూ ముందుకు వెలుతున్న జగన్ సంక్రాంతి గంగిరెద్దు రాకతో ఓ చోట నిలబడ్డారు. అప్పుడు ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు ఎద్దు తలను అడిస్తుండగా ఆ క్షణంలో ఇనుప కంచెకు అటువైపు ఉన్న గంగిరెద్దు తల, ఫెన్సింగ్‌పై ఉన్న ఇనుప రాడ్‌కు తగిలేలా అనిపించడంతో వెంటనే అప్రమత్తమైన సీఎం జగన్‌.. ఆ ఇనుప రాడ్‌పై తన చేతిని అడ్డుగా ఉంచారు.దీంతో  సీఎం జగన్ చేసిన పనికి చేతులెత్తి నమస్కరించారు ఆ గంగిరెద్దు యజమాని. దీంతో సీఎం జగన్ కు మూగజీవలపై ఉన్న ప్రేమను అందరూ కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: