ఏపీలో గత కొన్నిరోజులుగా పలు ఆలయాలపై వరుస దాడులు జరగడం ఏపీ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చెయ్యడంతో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా తీవ్ర దుమారం రేగింది. దీంతో రాజకీయ పార్టీలు అన్నీ కూడా రామతీర్థం లో పర్యటనలు చెయ్యడం..పలు పార్టీల కీలక నేతలు వివాదాలు రేపే వ్యాఖ్యలు చెయ్యడంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఇదిలా ఉండగా ఆలయాలపై దాడులు చేసిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఏపీ డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ మీడియా తో నిర్వహించిన సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆలయాలపై జరిగిన దాడుల వెనుక  రాజకీయ నేతల ప్రమేయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు‌.

ముఖ్యంగా ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా చేసేందుకే ఆలయాలపై దాడులు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. అయితే నిందితులు ఎంతటి వారైనప్పటికి  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నట్టు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: