మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిస్థితి.. ఘోరంగా తయారయింది. ప్రత్యర్థి బైడెన్‌ చేతిలో ఘోర ఓటమి ఎదురైనా.. అంగీకరించకుండా పదవిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ట్రంప్‌ చరిత్రలో ఏ అధ్యక్షుడూ కానంత అబాసు పాలయ్యారు. చివరకు ఆయన అత్యంత యాక్టివ్‌గా ఉండే.. సోషల్‌ మీడియా నుంచి బహిష్కృతుడు కావాల్సి వచ్చింది. దాదాపుగా అన్ని కీలక సామాజిక మాద్యమాలూ... ఆయనపై బ్యాన్‌ విధించేయడం సంచలనం రేపుతోంది.

డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియా సైట్స్, యాప్స్ ఒక్కొక్కటిగా షాకిస్తూనే. ఈ జాబితాలో తాజాగా స్నాప్‌చాప్ కూడా చేరింది. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేసినట్లు స్నాప్‌చాప్ ప్రకటించింది. దేశ రాజధాని వాషింగ్టన్‌లోని కేపిటల్ భవనంపై దాడి ఘటన వల్లే ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టం చేసింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ట్రంప్ తన స్నాప్‌చాట్ ఖాతా ద్వారా అశాంతిని రేకెత్తించే అవకాశం ఉన్నందున ఆపరేటర్లు భయపడుతున్నారని, అందుకే ఆయన ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేసినట్లు స్నాప్‌చాట్  చెప్పుకొచ్చింది.

ఇప్పటికే ఫేస్‌బుక్, ఇనస్టా గ్రామ్‌, యూట్యూబ్ తదితర ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు కూడా ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి. ఇక మిగిలింది స్నాప్‌చాట్ ఖాతానే కావడంతో దీని ద్వారా ట్రంప్ పోస్టులు చేసే అవకాశం ఉందని భావించిన యాప్ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఖాతాను తొలగించినట్లు సమాచారం.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ట్రంప్‌ ఖాతాను తాత్కాలికంగా బ్యాన్‌ చేశాయి. ఇంకెప్పుడూ.. తమ ప్లాట్‌ఫామ్‌పై ట్రంప్‌ ఇక పోస్టులు పెట్టలేరని స్పష్టం చేసింది. ఆ తర్వాత యూట్యూబ్‌ కూడా అదే పనిచేసింది. ట్రంప్‌ యూ ట్యూబ్‌ చానెల్‌పై ఏడు రోజుల పాటు నిషేధం విధించింది. ఎలాంటి వీడియోలూ అప్‌లోడ్‌ చేయకుండా చర్యలు తీసుకుంది. త‌న విధానాల‌ను ఉల్లంఘించిన‌ట్లు కూడా యూట్యూబ్.. ట్రంప్‌ ఛాన‌ల్‌కు వార్నింగ్ ఇచ్చింది.  హింస‌ను రెచ్చగొడుతున్నట్లుగా ట్రంప్ ఛాన‌ల్ కాంటెంట్ ఉందని ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: