తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫిట్ మెంట్‌పై అతి త్వరలోనే ప్రకటన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30 శాతం ఫిట్‌మెంట్ అందించేందుకు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కరోనా ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫిట్‌మెంట్ ప్రకటించిన అనంతరం వివిధ బెనిఫిట్స్ అంశాలపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారని సమాచారం. అయితే గతంలో పోయిన పీఆర్సీ లా కాకుండా ఈసారి కాస్త తక్కువే ఉంటుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి.

 

 అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగ్జాక్ట్ గా 30 శాతం మాత్రమే ఫిట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటికే ఫైనల్ అయిందనే వార్త కూడా వినిపిస్తూ ఉంది. అయితే అతి త్వరలో అధికారిక ప్రకటన చేసేటప్పుడు ఈ విషయంలో చిన్న చిన్న మార్పులే తప్ప.. పెద్దగా అయితే మార్పులు ఉండవు అనే విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత పీఆర్సీపై జీవో వస్తుండడంతో.. ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాల్లో మరింత ఆసక్తి నెలకొంది. పీఆర్సీ.. ఫిట్ మెంట్ పై చాలా తక్కువ రోజుల్లోనే జీవో విడుదల కానుంది. అయితే ఫిట్మెంట్ను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశంపై ఇంకా రాష్ట్ర టీఆర్ఎస్ సర్కార్ తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. వాస్తవానికి పీఆర్సీ కమిటీ గడువు డిసెంబర్‌ 31తో ముగిసింది. అయితే గడువును మరో మూడు నెలలపాటు పొడిగించాలని పీఆర్సీ చైర్మన్‌ సీఆర్‌ బిస్వాల్‌ ఇటీవలే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం కూడా తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రగతిభవన్‌కు పంపటం కూడా జరిగింది. ఇక తరువాతి సమావేశంలోనే ఫిట్‌మెంట్‌ శాతాన్ని ఖరారు చేసి వెంటనే పీఆర్సీ అమలుపై ప్రకటన చేస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి అంచనాగా ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: