భారత్ చైనా సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ యొక్క బలం ఏంటి అన్నది అటు సాధారణ ప్రజలకు కూడా తెలిసి వస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా భారత ఆర్మీ లో ఎన్ని రకాల విభాగాలు ఉన్నాయో.. ఏ విభాగాలు ఎంత సామర్థ్యాన్ని శక్తిని కలిగి ఉన్నాయో... ఎంత మేరకు పోరాటానికి సాగిస్తాయో అనే విషయాలు కూడా సామాన్య ప్రజలకు కూడా తెలిసి వచ్చింది. ఈ క్రమంలోనే భారత్-చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... చైనా సైనికులు భారత సైనికుల పై మూకుమ్మడిగా దాడి చేయగానే భారత సైన్యంలోని ఘాతుక్  విభాగం రంగంలోకి దిగింది అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఘాతుక్ విభాగం చైనా సైన్యం పై మూకుమ్మడిగా పడిపోయి ఏకంగా ఒక్కొక్కరి మెడలు విరిచి దారుణంగా ప్రాణాలు తీసింది. ఇక ఘాతుక్ దెబ్బకి అటు చైనా సైనికులు అందరు కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అయితే ఇలా చైనా సైనికులు వందల మంది ప్రాణాలను తీసింది ఘాతుక్ టీమ్. అయితే ఈ ఘటన తర్వాత చైనా డబుల్  గేమ్ కి ఎక్కడికక్కడ చెక్ పెడుతూ భారత్  ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే చైనాకు ఊహకందని రీతిలో ముందుకు సాగుతోంది భారత్.




 ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే భారత్ మరికొన్ని రోజుల్లో మరింత పటిష్టంగా మారబోతుంది అనేది తెలుస్తుంది. కొత్తగా ఘాతుక్ డ్రోన్లు  తీసుకువచ్చేందుకు సిద్ధమైంది భారత్. భారత చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న అటువంటి స్విఫ్ట్ ఎటాక్  డ్రోన్లు... ఈ శక్తివంతమైన డ్రోన్లను ఈ  సంవత్సరంలో భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ  అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్ కు సంబంధించినటువంటి హెరాన్ డ్రోన్ల స్థాయిలో ఈ డ్రోన్లు పనిచేస్తాయట. స్టెల్త్  ఫైటర్స్ అని కూడా వీటిని  పిలుస్తారు. ఇది  శుభపరిణామం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: