రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయం సెపరేట్ గా ఉంటుంది. అందుకే దొడ్డిదారిన ఇంత త్వరగా ఇంతటి స్థాయికి చేరుకోగలిగాడు. ఓ పార్టీ తరపున ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే అయనకి రాజకీయాల్లో ఎంతటి చాణక్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. అయన ప్రజలకోసం కాకుండా పదవులకోసమే ఎక్కువగా ఆరాటపడుతుంటారు. ప్రజలకు సేవ చేయడం మరిచిపోయి తన ప్రయోజనాలను ఎలా మెరుగుపరుచుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను చిన్న చూపు చూస్తూ అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి ప్రజలే దేవుళ్లుగా ఆయనకు కనిపించడం జరుగుతూ ఉంటుంది.

ఇది రాజకీయ విశ్లేషకులు బహిరంగంగంగా అంటున్న మాట.. వాస్తవం గమనిస్తే అదే నిజమనిపిస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరు చూసిన విషయమే.. అవినీతి ఎక్కువగా జరిగింది కూడా మొన్నటి చంద్రబాబు హయాంలోనే .. అందుకు ఫలితంగానే ఇప్పుడు టీడీపీ నేతలు జైలుకి వెళుతున్న వైనం మనం చూస్తున్నాం.. అయితే ఓడిపోయినప్పుడు చంద్రబాబు లో ఎప్పుడు లేని దయాగుణం కనిపిస్తుంది..  కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు వ్యాఖ్యలు  దీనికి నిదర్శనం గా చెప్పొచ్చు.

ఆ కార్యక్రమంలో యధావిధిగా జగన్ ను విమర్శించిన చంద్రబాబు ప్రజల సానుభూతి పొందడం కోసం తనకి తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే తనని క్షమించాలని కోరారు. రాష్ట్ర ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఇలాంటి వాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా మాట్లాడడం చంద్రబాబు రాజకీయ చక్రంలో ఒక భాగంగా చెప్పచ్చు, గతంలోనూ చంద్రబాబు ఇలాంటి చర్యలు చాలానే చేశాడు. అయితే అప్పుడు చంద్రబాబు ను నమ్మిన ప్రజలు ఇప్పుడు నమ్మరని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తో తేలిపోయింది. మరి ఇప్పుడు ఎలాంటి కొత్త రాజకీయ ఎత్తుగడ వేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: