టీ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. చాల మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.  కొన్ని పరిశోధనల్లో తేయాకు తాగడం మంచిదని తేలితే మరికొన్ని పరిశోధనల్లో టీ సేవనం అంత మంచిది కాదని తేలింది. అయితే పరగడుపునే టీ  తాగితే టీలోని కెఫీన్ ఒంటికి చేరి చురుకుదనం పెంచుతుంది. కానీ పరగడపున టీ తాగటం చాలా ప్రమాదకరమని తేలింది. అంతేకాదు టీతోపాటు మనం తీసుకునే కొన్ని పదార్థాలతో కూడా కాస్త హానికరమైనవేనట.

ఇక టీ తాగేప్పుడు మనం తరచుగా నమిలే కొన్ని స్నాక్స్ తో ఈ చిక్కులు వస్తాయన్నమాట. అంతేకాదు ప్లాస్టిక్ కప్పులో టీ తాగటంతో క్యాన్సర్ వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదాలు చాలా ఎక్కువ. అందుకే వేడివేడి టీని మనం ఎలాంటి కప్పుల్లో తాగుతున్నామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. బంగారం లేదా వెండి కప్పుల్లో గరం గరం చాయ్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మీకు తెలుసా.

అయితే చాలా వేడిగా చాయ్ తాగితే అలవాటున్నట్టైంతే వెంటనే దాన్ని మానుకోండి. లేకపోతే ఇలా అతివేడి ఉన్న టీ తాగితే ఓ రకమైన క్యాన్సర్  వస్తుంది. రోజూ 75డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న టీ తాగే వారికి esophageal cancer వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. ఒక్క త్రోట్ క్యాన్సర్ మాత్రమే కాదు ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయి.

మంచి పోషకాలున్న డ్రై ఫ్రూట్స్, కూరగాయలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ టీతో పాటు వీటిని తీసుకుంటే మాత్రం అది విషంగా మారటం ఖాయం. క్యాబేజ్, కాలీఫ్లవర్, ముల్లంగి, బ్రకోలి, బ్రసెల్స్ స్ప్రౌట్స్, టర్నిప్స్, సోయాబీన్ వంటివాటిలో ఉండే goitrogans ఉంటుంది. కనుక వీటిని టీతో పాటు తిన్నప్పుడు అనారోగ్యానికి దారితీస్తుంది. చాలా మంది టీతో పాటు బజ్జీలు, పకోడీలు, గారెలు వంటి చిరుతిళ్లు తింటారు. కానీ సెనగపిండితో చేసిన ఇలాంటి వంటలతో పాటు చాయ్ తాగితే మీ ఒంట్లో పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు కడుపు నొప్పి, విరోచనాలు వంటి స్టమక్ అప్ సెట్ లు తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: