తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. బిజెపి రాష్ట్ర నాయకత్వం మొత్తం సైలెంట్గా ఉన్న తరుణంలో బండి సంజయ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ అవినీతి వ్యవహారాలు ఎక్కువ చేస్తున్నారు అని పదేపదే బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల సిబిఐ విచారణ కోరుతూ కొంత మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

దీనితో టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా కలవరం మొదలైంది. అయితే ఆయన కొంత మంది మంత్రులను కూడా టార్గెట్ చేశారని ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు బండి సంజయ్ కొన్ని క్షేత్ర స్థాయిలో జరిగిన పనుల పరిశీలనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కి కేటాయింపుల్లో భారీగా అవినీతి జరిగిందని బండి సంజయ్ పదేపదే ఆరోపిస్తున్నారు.

కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బులు తీసుకుని ఇళ్ళు ఇచ్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అది పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు అంశాలను ప్రధాన ఎజెండాగా చేసుకుని ఆయన త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అవసరమైతే బిజెపి కేంద్ర నాయకత్వం కూడా ఈ పరిశీలనకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: