ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న నేతలతో మాత్రమే సన్నిహితంగా ఉండటంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు కూడా దారుణంగా తయారవుతుందనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే పార్టీ అన్ని విధాలుగా కూడా సహకరించిన పరిస్థితి మనం చూసే వాళ్ళం.

కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడటంలేదు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలపై పార్టీలోని సీనియర్ నేతలు మినహా పెద్దగా యువ నేతల నుంచి ఎలాంటి మద్దతు రావడం లేదు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అంటున్నారు. ఇక సీనియర్ నేతలు కొంతమంది మీడియా సమావేశాల్లో కనపడుతూ రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేయాలని భావించినా సరే వాళ్ళ గొంతు వినడానికి ప్రజలకు ఆసక్తి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

కొంతమంది సీనియర్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం... లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు లేఖలు రాయడం మినహా వాళ్ళు ఏమీ చేయటం లేదు అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీలో గతంలో అన్ని పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు మీడియా ముందు కనపడుతున్నారు. కొత్త నేతలను ముందుకు తీసుకు రాకపోవడంతో కొందరు యువ  నేతల్లో ఉత్సాహం అనేది తరిగిపోతుంది. వారిలో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైఖరి అని అంటున్నారు. ఆయన కారణంగా చాలామంది ఉత్తరాంధ్ర నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక రాయలసీమ జిల్లాల్లో అయితే అధికార వైసీపీకి భయపడే పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం వారిని ముందుకు తీసుకొచ్చి ధైర్యంగా ముందుకు నడిపించే లేకపోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: