లాక్ డౌన్ లో కూరగాయల రేట్లు మండిపోయిన సంగతి తెలిసిందే.. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోవడంతో ధరలు ఆకాశానికి నిచ్చెనలు వేశాయి. ఈ మేరకు టమోటా ధరలు 50 నుంచి 60 రూపాయలు పలికిన ధరలు .. ప్రస్తుతం టమోటా ధరలు రూ. 10 నుంచి 20 రూపాయలు కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..



విషయానికొస్తే.. హైదరాబాద్‌ మార్కెట్‌కు రోజుకు 120 నుంచి 140 లారీల మేరకు తరలి వస్తున్నాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నగరం లోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లయిన గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి, ఎల్‌బి నగర్‌, మాదన్నపేట వంటి మార్కెట్‌ల తో పాటు రైతు బజార్లలోనూ టమాటా ధరలు బాగా పడిపోయాయి. ఇప్పుడు మార్కెట్ లో కిలో టమాటా 10 నుంచి 15 రూపాయలకే అమ్ముతున్నారు. కొన్నిమార్కెట్‌లలో అయితే కిలో టమాటగా 7 నుంచి 10 రూపాయలకు అమ్ముతున్నారు. లాక్ డౌన్ తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని, పండించిన పంటకు అయిన ఖర్చులు కూడా రాలేదని వాపోతున్నారు..




కరోనా కారణంగా రెండు మూడు నెలల క్రితం టమాటా కొరత తీవ్రంగా ఉండడం, వర్షాల వల్ల పంట నష్టాలతో చాలా మంది రైతులు టమాటా పంటకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతుల ఎక్కువగా వస్తున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌కు భారీగా దిగుమతులు పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం టమాటా మాత్రమే కాకుండా గత కొన్నిరోజులుగా మిగిలిన రకాల కూరగాయలు సైతం అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే లభిస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. ఇలానే ధరలు కొనసాగితే రైతులు ఆత్మ హత్య చేసుకొనే పరిస్థితి వస్తుందని అంటున్నారు.. టమోటాలను గిట్టు బాటు ధరలకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: