చైనా పక్కనే ఉంటూ భారత్ మీద చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇది ఒక రోజు పగ కాదు, ఒకనాటితో తీరేది కాదు, డైరెక్ట్ గా సరిహద్దుల్లోకి దూసుకువస్తుంది. ఇండైరెక్ట్ గా దాయాది పాక్ ని ప్రోత్సహించి మరీ రెచ్చగొడుతుంది. దెబ్బతీయాలని చూస్తుంది. ఇక మరో వైపు చూస్తే కనబడని శత్రువులను పంపించి మరీ భారత్ లాంటి అతి పెద్ద దేశాన్ని కకావికలు చేయాలని చూస్తుంది.

అందులో  భాగమే కరోనా వైరస్. ఇందులో ఎవరికీ అనుమానాలు లేవు. కరోనా వైరస్ వల్ల భారత్ చాలా ఇబ్బంది పడుతుందని చైనా కరెక్ట్ గానే ఊహించింది. ఎందుకంటే ఆ దేశం తరువాత అతి పెద్ద జనాభా ప్రపంచంలో భారత్ దే. పైగా వైద్య సదుపాయాలు లేవు, పేదరికంతో అవస్థ పడుతున్న దేశమిది. దాంతో కచ్చితంగా భారత్ కధ తేలిపోతుందనుకుంది. కానీ ఇక్కడే తేడా కొట్టింది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలే కరోనా కాటుకు బలి అయ్యాయి.

వాటితో పోలిస్తే భారత్ లో కరోనా ప్రభావం చాలా తక్కువగానే ఉంది. మొత్తం 130 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం కోటీ 47 లక్షల మందికి మాత్రమే కరోనా సోకింది. మరణాలు కూడా ముప్పై లక్షల లోపునే ఉన్నాయి. ఇపుడు దానిని మించిన రెట్టింపు ఉత్సాహంతో భారత్ కరోనా వ్యాక్సిన్ కనుగొంది.  చాలా వేగంగా ఈ వ్యాక్సిన్ ని అందుబాటులోకి తెస్తోంది. ఇది భారతీయ ఔషధ‌ రంగానికి ఒక గర్వకారణం.

అంతే కాదు, ఒక్క భారత్ నే కాదు, ప్రపంచానికే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కరోనా పీడ శాశ్వతంగా వదిలించాలని భారత్ కంకణం కట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతులో మీదుగా ఈ రోజున ప్రారంభం కాబోతున్న కరోనా వ్యాక్సిన్ అతి పెద్ద పండుగను దేశంలోకి తెచ్చింది. ఒక విధంగా ఇది చైనా కుట్రను బద్ధలు కొట్టిన రోజుగా చూడాలి. భారత్ పౌరులంతా ఔషధ రంగానికి, పరిశోధకులకు సెల్యూట్ చేయాల్సిన  రోజు ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: