రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడుల్లో భాజపా కు చెందిన నలుగురు కార్యకర్తల హస్తం ఉందని గత రెండు రోజులు గా  సామాజిక మాధ్యమాల్లో  హల్ చల్ చేస్తుంది అని... పోలీసులు ముఖ్యంగా బిజెపి కార్యకర్తలు వున్నారు అనే  తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తుంది అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు 48 గంటల ముందు పాత్రికేయుల సమావేశం నిర్వహించి దేవాలయాల ధ్వసం ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపారు అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో దేవాలయాలు పై దాడి అన్యమతస్తులనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది  అని అన్నారు. దీనిని దృష్టి మళ్లించేందుకు పోలీసులు రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. రెండు రోజులుగా భాజపా కార్యకర్తలను దోషులుగా చూపిస్తే పోలీసులు కార్యకర్తల పై కేసు నమోదు చేసాం అని చెప్పడాన్ని  భాజపా ఖండిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పోలీసు రాష్ట్రం లో దుండగుల చర్యలతో  దేవాలయాలను రక్షిస్తారనే నమ్మకం పోతుంది అని విమర్శించారు. పోలీసులు వైకాపా కోసం పనిచేస్తున్నారా,లేక ప్రజల కోసం పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు.  

ప్రభుత్వ చేతకాని వైఖరికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అన్నారు. దేవాలయాల దాడుల కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు. ఈరోజు విడుదల చేసిన పోలీసు ప్రకటనను ఉపసంహరించు కోవాలని భాజాపా డిమాండ్ చేస్తుంది అని మండిపడ్డారు. సామాజిక మాధ్యమం లో పోస్టుల కేసుకుదేవాలయాలకూల్చివేత ,విగ్రహాల ధ్వంసం కేసులకు తేడా తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు నటిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు అని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజలలో  నమ్మకం కోల్పోయింది అన్నారు ఆయన. నేడు ఎటువంటి ఆధారాలతో బీజేపీ కార్యకర్తలు అందులో ఉన్నారని చెప్పగలుగుతున్నారు? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: