మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకు అందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే కొన్ని కొన్ని సార్లు అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకోని విధంగా మృత్యువు వచ్చి కబళిస్తూ  ప్రాణాలను తీసుకు పోతూ ఉంటుంది. అదే సమయంలో ఇక ఎంతో మంది కుటుంబంలో విషాదం నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎక్కడో వ్యక్తి విషయంలో ఇలాంటి ఘటన జరిగింది. అతను ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఇక దొరికిన చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబ పోషణ చూసుకునేవాడు అంతేకాదు విద్యుత్ అధికారుల వద్ద సహాయకుడిగా కూడా పనిచేస్తూ ఉండేవారు.


 ఈ క్రమంలోనే కాస్త రిస్క్  పనులు కూడా చేస్తూ ఉండేవాడు ఆ ఎలక్ట్రీషియన్.  సాధారణంగా ఎలక్ట్రీషియన్ అన్న తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరెంట్ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న ఇక చివరికి ప్రాణాలను సైతం పోగొట్టుకోవాల్సినా దుస్థితి ఏర్పడుతూ ఉంటాయి.  ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది ఈ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ విషయంలో.  ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా  చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ సాఫీగా జీవనం సాగిస్తున్న ఎలక్ట్రీషియన్ ను  విధి చిన్నచూపు చూసింది.



 చివరికి విద్యుత్ ప్రమాదం రూపంలో కబళించింది ప్రాణాలు తీసింది. ఈ ఘటన నిజాంబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రం సుభాష్ నగర్ లో చోటుచేసుకుంది.  ప్రైవేట్ ఎలక్ట్రీషియన్  మీర్జా రజాక్ కొంతకాలంగా విద్యుత్ అధికారుల వద్ద సహాయకుడిగా పని చేస్తున్నాడు.  ఇక ఇటీవలే ఒక దుకాణానికి విద్యుత్ నిలిచిపోవడంతో సరిచేసేందుకు 200 రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ఎల్సి  తీసుకొని స్తంభం ఎక్కాడు.  అదే స్థానానికి పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో రజాక్ శరీరం మొత్తం కాలిపోయాయి స్తంభానికి వేలాడుతూ ఉండిపోయింది.  దీంతో  కొన ఊపిరితో ఉన్న అతని కిందకు దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు వదిలాడు. కాగా మృతుడికి మూడు నెలల కిందట వివాహం జరగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: